భైషజ్యగురు బుద్ధుడు

భైషజ్యగురు (Bhaisajyaguru), మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు భైషజ్యగురు వైడూర్య ప్రభుడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ఔషధ బుద్ధుడు అని మరోక పేరు ఉంది. జపాన్లో ఈ బుద్ధుని యకూషి అని అంటారు.

భైషజ్యగురు బుద్ధుడు

ఈ బుద్ధుని లోకము వైడూర్య నిర్భాసము.

మంత్రములు

బైషజ్యగురు బుద్ధుని మంత్రాన్ని నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును ఔషధ బుద్ధుడు ధారణీ అని అంటారు. ఆ మంత్రము:

ఓం నమో భగవతే భైషజ్యగురు వైడూర్య ప్రభరాజాయ తధాగతాయ అర్హతే సమ్యక్సం బుద్ధాయ
తద్యథా: ఓం
భైషజ్యే బైషజ్యె భైషజ్య సముద్గతీ స్వాహా

ఈ మంత్రము అంతిమ భాగాన్ని కొన్ని మార్పులుతో ఔషధ బుద్ధుని హృదయ మంత్రము అని అంటారు

తద్యథా: ఓం
భైషజ్యే భైషజ్యే మహాభైషజ్యే భైషజజ్యే రాజసముద్గతే స్వాహా

షింగోన్ బైద్ధములో కింది మంత్రాన్ని ప్రయోగిస్తారు

ఓం హురు హురు చండాళి మాతంగి స్వాహా

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.