భారూచ్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో భారూచ్ జిల్లా (గుజరాతీ:ભરૂચ) ఒకటి. భారూచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్యా పరంగా బోస్టన్ నగర జనసంఖ్యతో సమానం. జిల్లా గుజరాత్ రాష్ట్ర దక్షిణ భూభాగంలో పశ్చిమ తీరంలో ఉంది. నర్మదానది జిల్లాలో నుండి గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో సంగమిస్తుంది. నర్మదానది జిల్లాను ఉత్రర మరియు మధ్య భారతీయ రాజ్యాలతో అనుసంధానం చేస్తుంది.

Districts of central Gujarat

చరిత్ర

జిల్లాలో ఉన్న భారూచ్ నగరం మరియు పరిసర ప్రాంతాలు పురాతనకాల నౌకానిర్మాణ కేంద్రం మరియు నౌకాశ్రయంగా ఉండేది. ఇక్కడ నుండి గ్రీకు, పర్షియన్ మరియు రోం రాజ్యాలకు వ్యాపార సంబంధాలు ఉండేవి. వర్షాకాలంలో దేశంలోని తూర్పు భాగం నుండి సుగంధద్రవ్యాలు మరియు సిల్క్ ఇక్కడకు వచ్చి చేరడానికి నదీ ప్రవాహాలు అనుకూలంగా ఉండేవి.

విభాగాలు

జిల్లాలో ఉన్న తాలూకాలు :- బారుచ్, అంక్లేశ్వర్, హాన్సన్, జంబుసర్, ఝగదీ, అమొదె, గుజరాత్, వాలియా మరియు వాగ్ర. 

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,550,822, [1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 321వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 238 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.14%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 924:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 83.03%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లాలో ముస్లిములు 57% ఉన్నారు. హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. వొహారా పఠేల్ ముస్లిం ప్రజలకు ఇది స్వస్థలం.

సంస్కృతి

సుప్రసిద్ధ వ్యక్తులు

  • ఆడమ్ పటేల్, బ్లాక్బర్న్ ( బారన్ పటేల్)
  • అహ్మద్ పటేల్
  • అలిముద్దిన్ జుంల
  • బల్వంత్రయ్ తాకోరే (1869-1952) కవి. బారుచ్ లో జన్మించారు.
  • కనైయలల్ మనెక్లల్ మున్షి (1887-1971) భారత స్వాతంత్ర్య ఉద్యమం కార్యకర్త, రాజకీయ వేత్త, రచయిత మరియు విద్యావేత్త. బారుచ్ నగరంలో జన్మించాడు [4]
  • మునాఫ్ పటేల్
  • నిమిత్త్ దేశాయ్ (1988-)
  • రషీద్ పటేల్
  • త్రిభువనదాస్ లుహర్ (1908-1991) కవి. మియమతర్‌లో జన్మించిఅడు.[5]
  • మొహ్మెద్ హుస్సేన్ కాంట్రాక్టర్
  • నర్మదనంద్‌జి యు.సి.హెచ్.ఎ.ఎల్.ఇ ఆశ్రమాన్ని అంక్లేశ్వర్ మమీపంలో ఉన్న నరేశ్వర్‌లో నడుపుతున్నారు.

ఇవికూడా చూడండి

  • Kalpasar Tidal Energy Project| కల్పసర్ టైడల్ ఎనర్జీ ప్రాజెక్ట్

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gabon 1,576,665 line feed character in |quote= at position 6 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)
  4. "Bhavan's Faith". Bharatiya Vidya Bhavan. Retrieved 20 May 2011.
  5. "Tribhuvandas Luhar (Sundaram)". Thakkar Numismatic and Art Foundation. Retrieved 20 May 2011.


మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.