భారత పార్లమెంటు

భారత పార్లమెంటు Parliament of India (లేదా సంసద్), భారత ఫెడరల్ ప్రభుత్వ, అత్యున్నత విధాన అంగము. దీని యందు రెండు సభలు గలవు, ఒకటి లోక్ సభ రెండవది రాజ్యసభ. ఇది భారత రాజధాని ఢిల్లీ లోని సంసద్ మార్గ్ లో గలదు.

భారత పార్లమెంటు
రకం
రకం
ద్వి సభ
సభలురాజ్యసభ
లోక్ సభ
నాయకత్వం
రామ్ నాథ్ కోవింద్
2017 జూలై 25 నుండి
రాజ్యసభ ఛైర్మన్
వెంకయ్యనాయుడు, స్వతంత్ర అభ్యర్థి
2017 ఆగస్టు 11 నుండి
మెజారిటీ నాయకుడు(లోక్ సభ)
ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ (భాజపా)
2014 మే 16 నుండి
లోక్ సభ స్పీకరు
మెజారిటీ నాయకుడు (రాజ్యసభ)
అరుణ్ జైట్లీ (భాజపా)
2014 మే 16 నుండి
నిర్మాణం
సీట్లు795 (250 రాజ్యసభ +
      545 లోక్ సభ)
లోక్ సభ రాజకీయ వర్గాలు
అధికారిక: ఎన్ డి ఎ ప్రతిపక్షాలు: యూపీఎ, మూడవ ఫ్రంట్ మరియు ఇతరులు
రాజ్య సభ రాజకీయ వర్గాలు
యూపీఎ (మెజారిటీ), ఎన్ డి ఎ (రెండవ), ఇతరులు : మూడవ ఫ్రంట్
ఎన్నికలు
లోక్ సభ చివరి ఎన్నికలు
2014
సమావేశ స్థలం
సంసద్ భవన్
వెబ్‌సైటు
parliamentofindia.nic.in

పేరు పుట్టు పూర్వోత్తరాలు

సంసద్ అనే పదము సంస్కృతానికి చెందినది, అర్థం ఇల్లు లేక భవనం.

లోక్ సభ

లోక్ సభ కు, ప్రజాసభ లేదా దిగువసభ అని అంటారు. దీనిలోని దాదాపు సభ్యులంతా ప్రజలచేత ఎన్నుకోబడినవారే. ఇది అత్యంత శక్తివంతమైన సభ, కొన్ని సార్లు రాజ్యసభ నిర్ణయాలను సైతం తోసిరాజంటుంది.

ఈ సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత రాష్ట్రపతి తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి. ప్రస్తుతం లోక్ సభలో 545 మంది సభ్యులున్నారు. 530 మంది రాష్ట్రాలనుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మరియు 2 నామినేట్ చేయబడిన ఆంగ్లో-ఇండియన్ సభ్యులు గలరు.

సంసద్ భవన్, భారత పార్లమెంటు.

రాజ్య సభ

రాజ్యసభను "రాజ్యాంగ పరిషత్తు" అని లేదా "ఎగువ సభ" అనికూడా అంటారు. దీని సభ్యులు భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలచే ఎన్నుకోబడతారు. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.

రాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడూ 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు. ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 80 లో వివరింపబడింది.

  • 12 మంది సభ్యులు భారత రాష్ట్రపతి చే నామినేట్ చేయబడతారు. వీరు జ్ఞానరంగాలనుండి, సాహిత్య, శాస్త్రీయ, కళా మరియు సాహిత్యరంగాలనుండి నామినేట్ చేయబడతారు.
  • రాష్ట్రాలలోని శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
  • కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు, ఎలెక్టోరల్ కాలేజి ద్వారా ఎన్నుకోబడుతారు.

రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ నుండి 31 సభ్యులుంటే, నాగాలాండ్ నుండి కేవలం ఒక్కరే. ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు. మనము నిజాయితీగా ఉండవలసిన భవనము.

పార్లమెంట్ భవనం (సంసద్ భవన్)

భారత పార్లమెంటు, సంసద్ భవన్.

పార్లమెంటు భవనం (సంసద్ భవన్), ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.

దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో గలవు, రాష్ట్రపతి భవన్కు అందుకున్నంత దగ్గరలో గలవు.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.