భారతీయ స్టేట్ బ్యాంకు
భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను అందిస్తుంది. 1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
| రకం | పబ్లిక్ |
|---|---|
| స్థాపితం |
|
| ప్రధానకార్యాలయం | |
| సేవా ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
| కీలక వ్యక్తులు | అరుంధతీ భట్టాచార్య (ఛైర్మెన్) |
| పరిశ్రమ | బ్యాంకింగ్, ఆర్థిక సేవలు |
| ఉత్పత్తులు | రీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు, ఫైనాన్స్ , ఇన్సూరెన్స్ సేవలు, పెట్టుబడిల బ్యాంకింగ్ సెవలు, లోన్స్ , ప్రైవేట్ బ్యాంకింగ్ & ఈక్విటీ, సేవింగ్స్ & సెక్యూరిటీస్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ |
| ఆదాయం | |
| నిర్వహణ రాబడి | |
| లాభము | |
| ఆస్తులు | |
| మొత్తం ఈక్విటీ | |
| ఉద్యోగులు |
|
| [1][2][3][4] | |
ప్రారంభ బీజాలు
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా 2 జూన్, 1806 న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన) మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బ్యాంకు స్థాపించేవరకు ఈ బ్యాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము 30 ఏప్రిల్, 1955 నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటు చేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
కాలగమనంలో స్టేట్ బ్యాంకు
- 21 జూన్, 1806: కలకత్తా బ్యాంకు స్థాపన.
- 21 జనవరి, 1809: దీనిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా .
- 15 ఏప్రిల్, 1840: బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన .
- 11 జూలై, 1843: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన .
- 1861: పేపర్ కరెన్సీ చట్టం జారీ .
- 27 జనవరి, 1921: మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
- 11 జూలై, 1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .
- 1959: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ, దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
- 1980 కేరళలో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన్ ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేశారు. .
- 29 జూన్, 2007: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది .[5]
అనుబంధ బ్యాంకులు
భారతీయ స్టేట్ బ్యాంకుకు 5 అనుబంధ బ్యాంకులు ఉన్నాయి. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి 1959లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.ఇటీవలే ఈ సంస్ధలన్ని ఇందులో విలీనం అయ్యాయి.
విదేశాలలో శాఖలు
|
|
మూలాలు
- "Annual Report [2016-17] of State Bank of India" (PDF).
- "State Bank of India Consolidated Yearly Results, State Bank of India Financial Statement & Accounts". www.moneycontrol.com. Retrieved 2017-06-26.
- "State Bank of India Yearly Results, State Bank of India Financial Statement & Accounts". www.moneycontrol.com. Retrieved 2017-06-26.
- "From Imperial Bank to State Bank" (PDF). Retrieved 28 June 2017.
- [www.andhranews.net/Business/2007/June/29-Government-acquires-entire-6391.asp "Government acquires entire RBI shares in SBI"] Check
|url=value (help). AndhraNews.net. Retrieved 2007-06-29.
బయటి లింకులు
- Main SBI Site
- Online SBI
- Online SBI (Global)
- SBI Act 1955
- State Bank of India Branches,ATMs,Products
- State Bank of India financial summary at Google Finance