భాగ్యరాజ్

కె. భాగ్యరాజ్ ఒక ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత, మరియు నిర్మాత. కొన్ని తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్ళకు కూడా రచన, దర్శకత్వం చేశాడు. ముంధనై ముడిచ్చు (1983) అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. భాగ్య అనే వార పత్రికకు సంపాదకుడు. కొన్ని నవలలు కూడా రాశాడు.

కె భాగ్యరాజ్
జననంక్రిష్ణస్వామి భాగ్యరాజ్
(1953-01-07) 1953 జనవరి 7
వెల్లన్ కోయిల్, గోబిచెట్టుపాళ్యం, తమిళనాడు[1]
వృత్తినటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1977–ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రవీణ (m 1981–1983) (deceased)
పూర్ణిమా జయరాం
(m 1984–ప్రస్తుతం)
పిల్లలుశరణ్య భాగ్యరాజ్ (b 1985)
శంతను భాగ్యరాజ్ (b 1986)
తల్లిదండ్రులు
  • క్రిష్ణస్వామి
  • అమరావతి అమ్మాళ్

వ్యక్తిగతం

భాగ్యరాజా తమిళనాడు లోని ఈరోడ్ జిల్లాలోని వెళ్ళన్ కోయిల్ అనే ఊర్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కృష్ణస్వామి, అమరావతియమ్మ. ఆయన రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య ప్రవీణను 1981 లో వివాహం చేసుకున్నాడు. ఆమె కామెర్లతో 1983లో మరణించింది. తరువాత 1984లో పూర్ణిమా జయరాం తో పెళ్ళి జరిగింది. ఆమె డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ (1983)అనే సినిమాలో ఆయన సహనటి. [2] వీరిద్దరూ నటీమణులే. వారికి శరణ్య భాగ్యరాజ్ అనే కుమార్తె మరియు శంతను భాగ్యరాజ్ కుమారుడు ఉన్నారు. శరణ్య పారిజాతం అనే సినిమాతో, శంతను సక్కరకట్టి అనే సినిమాతో సినీరంగంలో ప్రవేశించారు.

మూలాలు

  1. "K Bhagyaraj, profile". tamiloprofile.com. Retrieved 29 December 2015.
  2. "K.Bhaagya Raj - Chitchat". Telugucinema.com. 12 June 2010. Retrieved 17 November 2012.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.