భాగేశ్వర్

భాగేశ్వర్ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటి. భాగేశ్వర్ నగరం జిల్లాకేంద్రంగా ఉంది. భాగేశ్వర్ జిల్లా తూర్పు సరిహద్దులో కుమోన్ ప్రాంతం, పడమర మరియు వాయవ్య సరిహద్దులో చమోలి , తూర్పున పితోరాఘర్ మరియు దక్షిణ సరిహద్దులో అల్మోరా జిల్లాలు ఉన్నాయి. 2011 గణాకాలను అనుసరించి అత్యల్ప జనసంద్రత కలిగిన ఉత్తరాఖండ్ (13) జిల్లాలలో భాగేశ్వర్ 3 వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో రుద్రప్రయాగ్ మరియు చంపావత్ జిల్లాలు ఉన్నాయి.

బాగేశ్వర్ జిల్లా
बागेश्वर जिला
జిల్లా
బాగేశ్వర్ జిల్లా
Location in Uttarakhand, India
భౌగోళికాంశాలు: 29.85°N 79.77°E / 29.85; 79.77
దేశము India
రాష్ట్రముఉత్తరాఖండ్
డివిజన్కమాన్
జిల్లా కేంద్రంబాగేశ్వర్
విస్తీర్ణం
  మొత్తం2,302
జనాభా
  మొత్తం2,49,462
  సాంద్రత108
భాషలు
  అధికార భాషహిందీ
సమయప్రాంతంభా.ప్రా.కా (UTC+5:30)
వెబ్‌సైటుbageshwar.nic.in

[1]

గణాంకాలు

2011 గణాంకాలను అనుసరించి భాగేశ్వర్ జిల్లా జనసంఖ్య 259,840.[1] ఇది దాదాపు వనౌతు దేశ జనసంఖ్యకు సమానం. [2] భారతీయ జిల్లాలలో (640) భాగేశ్వర్ 578వ స్థానంలో ఉంది.[1] జిల్లా జనసాంద్రత చదరపు కి.మీ 116..[1] 2011-2001 కుటుంబనియంత్రణా శాతం 5.13% . [1] జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి 1093:1000. [1] అలాగే అక్షరాశ్యతా శాతం 80.69%. [1] 2001 గణాంకాలను అనుసరించి భాగేశ్వర్ జిల్లా జనసంఖ్య 249,462. వీరిలో హిందువుల సంఖ్య 247,402, ముస్లిముల సంఖ్య1,280, క్రైస్తవులు 361. [3]

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "Uttarakhand - Districts of India: Know India". National Portal of India. Archived from the original on 19 February 2009. Retrieved 2009-04-04.

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.