భాగవతం - ఒకటవ స్కంధము

భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 (17) పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన నారద మహర్షి విచ్చేసిభాగవతము రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.

భాగవతం
స్కంధములు
ప్రధమ స్కంధము
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
పంచమ స్కంధము
షష్టమ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
నవమ స్కంధము
దశమ స్కంధము
ఏకాదశ స్కంధము
ద్వాదశ స్కంధము
**********************
కృష్ణుడు
దశావతారములు
హిందూధర్మశాస్త్రాలు
రామాయణం
మహాభారతం
పురాణాలు
వేదవ్యాసుడు
ఆంధ్ర మహాభాగవతము
బమ్మెర పోతన

ఓం నమో భగవతే వాసుదేవాయ

తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. మహాభారతము ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, భీష్ముని నిర్యాణము, శ్రీ కృష్ణ భగవానుని ద్వారకా ప్రయాణము, ద్వారకలో వారు ప్రవేశించడము, పరిక్షిత్తు జననము, దృతరాష్ట్రుడు అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, పరిక్షిత్తు మరియు కలి సంవాదము, పరిక్షిత్తు కలి పురుషుడుని దండించడము, దయచూపడము, పరిక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, శుకదేవ మహర్షి ఆగమనము, పరిక్షిత్తు వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు.

అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట

కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ సిబిరంలో అందరూ నిద్రిస్తుండగా, అశ్వత్థామ వీరావేశంతో వచ్చినిద్రిస్తున్న ఊప పాండవులను హాతమార్చెను. ఉప పాందవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదితో శపథం చేసి, కురుక్షేత్రంకి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకొని, వాడితో యుద్ధము చేసి చేసి, సవ్యసాచి ప్రతిభ ముందు తాడలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా, ఆ అస్త్రం లోకాలన్నిటిని క్రమ్మేస్తుండగా అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా, అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించి పిమ్మట రెండు బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి, అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా.

మూలాలు

బయటి లింకులు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.