భరతుడు
భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.

రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు
మూలాలు
- Naidu, S. Shankar Raju; Kampar, Tulasīdāsa (1971). A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan. Shank. University of Madras. pp. 44, 148. Retrieved 2009-12-21.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.