భరణి నక్షత్రము

Disambiguation

భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారభరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢశరీరశ్రమ
సంపత్తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢధన లాభం
విపత్తారరోహిణి, హస్త, శ్రవణంకార్యహాని
సంపత్తారమృగశిర, చిత్త, ధనిష్టక్షేమం
ప్రత్యక్ తారఆర్ద్ర, స్వాతి, శతభిషప్రయత్న భంగం
సాధన తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రకార్య సిద్ధి, శుభం
నైత్య తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రబంధనం
మిత్ర తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిసుఖం
అతిమిత్ర తార అశ్విని, మఖ, మూలసుఖం, లాభం
నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి
భరణిశుక్రుడుమానవస్త్రీదేవదారుఏనుగుమధ్యకాకియముడుమేషం

నక్షత్రములలో ఇది రెండవది.

భరణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - సింహరాశి.
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

భరణినక్షత్రము గుణగణాలు

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.

భరణి నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు

సంఖ్యలు

  • 6, 7, 9

మణి

వారములు

ఫలములు

  • స్తీసౌఖ్యం/స్తీసౌఖ్యము/స్త్రీసుఖము/స్త్రీసుఖం

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.