భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1].

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణ జిల్లాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యపట్టణంకొత్తగూడెం
తాలూకాలు24
విస్తీర్ణం
  మొత్తం8,951
జనాభా (2011)
  మొత్తం13,04,811
  సాంద్రత150
వాహన రిజిస్ట్రేషన్TS–28[2]
కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రంగా మార్పు

లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి.[4]

జిల్లాలో విద్యా సంస్థలు

జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

జిల్లా లోని మండలాలు

భౌగోళికం

ఈ జిల్లా వైశాల్యం 8,951 చద�kilo��పు మీటరుs (3,456 sq mi).[5]

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలొ 1,304,811 మంది ఉన్నారు.[5]

మూలాలు

  1. https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/
  2. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "Bhadradri district" (PDF). New Districts Formation Portal. Retrieved 11 October 2016.
  5. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.