బూరుగ

బూరుగ పత్తి ఉత్పత్తిచేసే ఒక పెద్ద వృక్షం. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం బొంబాక్స్ సీబా (Bombax ceiba).

బూరుగ దూది చెట్టు
Cotton tree with only flowers in spring
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: మాల్వేలిస్
కుటుంబం: మాల్వేసి
జాతి: బొంబాక్స్
ప్రజాతి: బి. సీబా
ద్వినామీకరణం
బొంబాక్స్ సీబా
లి.
పర్యాయపదాలు

బొంబాక్స్ మలబారికమ్ DC.
సల్మాలియా మలబారికా

లక్షణాలు

  • దృఢమైన శంఖ్వాకార కంటకాలతో కూడిన శాఖలు, కాండము ఉన్న పెద్దవృక్షం.
  • దీర్ఘవృత్తం లేదా అండాకార భల్లాకారంతో ఉన్న పత్రకాలున్న బహుదళయుత హస్తాకార సంయుక్త పత్రం.
  • ఏకాంత విన్యాసంలో అమరిన చిక్కని ఎరుపు రంగు పుష్పాలు.
  • పట్టువంటి కేశాలతో కప్పబడిన విత్తనాలున్న విదారక ఫలాలు.
కాయలతో బూరుగ చెట్టు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.