బల్లిపర్రు (పామర్రు)
బల్లిపర్రు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.
| బల్లిపర్రు (పామర్రు) | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() బల్లిపర్రు (పామర్రు) |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.278549°N 81.184396°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 715 |
| - పురుషుల సంఖ్య | 373 |
| - స్త్రీల సంఖ్య | 342 |
| - గృహాల సంఖ్య | 218 |
| పిన్ కోడ్ | 521148 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మందల పరిషతు ప్రాథమిక పాఠశాల, బల్లిపర్రు
గ్రామంలో మౌలిక వసతులు
శుద్ధినీటి పథకం:- ఈ గ్రామములో రు. 4 లక్షల రూపాయల వ్యయంతో, కీ.శే.యలమంచిలి జ్యోతిక స్మృత్యర్ధం, గ్రామ ప్రముఖులు, సినీ నిర్మాత శ్రీ యలమంచిలి రవిచంద్ వితరణతో ఏర్పాటు చేసిన ఎన్.టి.ఆర్.సుజలస్రవంతి పథకాన్ని, 2015,అక్టోబరు-27వతేదీనాడు ప్రారంభించారు. [4]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ దున్న నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం
శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం
ఈ పురాతన ఆలయం శిధిలావస్థకు చేరడంతో, ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, నూతన ఆలయ నిర్మాణానికి, 2017,జూన్-16వతేదీ శుక్రవారంనాడు, శంకుస్థాపన నిర్వహించి పనులు ప్రారంభించినారు. 2017,ఆగష్టు-9,10,11 తేదీలలో, ఆలయ పునఃప్రతిష్ట మరియు అమ్మవారి వార్షిక జాతర, 4 లక్షల రూపాయల వ్యయంతో, వైభవంగా నిర్వహించినారు. 11వతేదీ మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [5]&[6]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
- తమ్మారెడ్డి చలపతిరావు
- ఈ గ్రామంలో ఒక తెలుగు సినీ నిర్మాత ఉన్నారు, ఆయన పేరు శ్రీ యలమంచిలి రవిచంద్. [3]
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 715 - పురుషుల సంఖ్య 373 - స్త్రీల సంఖ్య 342 - గృహాల సంఖ్య 218
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 654.[3] ఇందులో పురుషుల సంఖ్య 347, స్త్రీల సంఖ్య 307, గ్రామంలో నివాస గృహాలు 175 ఉన్నాయి.
మూలాలు
- http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Balliparru". Retrieved 30 June 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-14; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-15; 29వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-17; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఆగస్టు-9&12; 1వపేజీ.
