బల్లి
| బల్లులు Temporal range: జురాసిక్ - Recent | |
|---|---|
![]() | |
| Central bearded dragon, Pogona vitticeps | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ఏనిమేలియా |
| విభాగం: | కార్డేటా |
| Superclass: | Tetrapoda |
| తరగతి: | సరీసృపాలు |
| క్రమం: | Squamata |
| ఉప క్రమం: | లాసర్టీలియా Günther, 1867 |
బల్లి (ఆంగ్లం Lizard) ఒక సరీసృపము.
బల్లులలో రకాలు
- గెక్కోనిడే: ఇంటి బల్లి
ఈ బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు ...... గాని అది ఇళ్లలో తిరుగుతుంటుండి గనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ ఉంది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని నమ్మిక. అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడా ప్రజల్లో ఓ మూఢ నమ్మకముంది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాల గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో బల్లిచూడండి. |
