బలిజిపేట (విజయనగరం జిల్లా)
విశాఖపట్నం జిల్లా లోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం బలిజిపేట (విశాఖపట్నం జిల్లా) చూడండి.

| బలిజిపేట | |
| — మండలం — | |
![]() విజయనగరం జిల్లా పటములో బలిజిపేట మండలం యొక్క స్థానము |
|
![]() బలిజిపేట |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.613061°N 83.529475°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | విజయనగరం |
| మండల కేంద్రము | బలిజిపేట |
| గ్రామాలు | 31 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 59,764 |
| - పురుషులు | 29,536 |
| - స్త్రీలు | 30,228 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 45.21% |
| - పురుషులు | 58.31% |
| - స్త్రీలు | 32.31% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
బలిజిపేట (ఆంగ్లం: Balijipeta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1] మరియు మండలము. (వినండి: ![]()
శాసనసభ నియోజకవర్గం
బలిజిపేట 1955 మరియు 1962లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజక వర్గం. తరువాత దీనిని ఉనుకూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.ప్రస్తుతం పార్వతీపురం నియోజక వర్గంలో విలీనం చేశారు.
వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ చిన్న నరసయ్య గారు శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.
విశేషాలు
- చరిత్రకారుల పరిశీలనల రీత్యా, బలిజ జాతి ప్రజలు ఈ గ్రామం నుంచి రాష్టమంతా వ్యాపించినట్లు భావిసున్నారు.[4]
- శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం 3 కి.మీ. దూరంలోని నారాయణపురం గ్రామంలో ఉన్నది. ఇది బహు పురాతనమైనదిగా 10 వ శతాబ్దంలో కళింగ రాజులచే నిర్మించబడినది.[5]
- ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల కలదు.[6]
- ఆంధ్రా బ్యాంకు శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ,ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంక్ శాఖ మరియు తపాళా కచేరి ఇక్కడ ఉన్నవి.
ఈ గ్రామంలో ప్రముఖులు
అంగజాల జగన్నాథయ్య
అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామం. వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952 లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో లారీలు లేదా రైలు ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 59,764 - పురుషులు 29,536 - స్త్రీలు 30,228
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- Election Commission of India-1955 results
- Election Commission of India-1962 results
- "Kapunadu History". Retrieved 2007-02-28.
- Jistor:Narayanapuram-A Tenth Century site of Kalingas
- School Information System of Department of School Education


