బరంపురం
బరంపురం లేక బరంపూర్ లేదా బ్రహ్మపుర్ ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరాన్ని సిల్క్ సిటీ (పట్టు నగరం) అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఒడిషా రాజధాని భువనేశ్వర్ నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.
| బరంపురం బరంపూర్ / బ్రహ్మపూర్ | |
|---|---|
| City | |
![]() బరంపురం రైల్వే స్టేషన్ | |
| Nickname(s): BAM | |
![]() బరంపురం | |
| భౌగోళికాంశాలు: 19.32°N 84.78°E | |
| దేశం | |
| రాష్ట్రం | ఒడిషా |
| జిల్లా | గంజాం |
| ప్రభుత్వం | |
| • మేయర్ | శివ్ శంకర్ దాస్ |
| ఎత్తు | m ( ft) |
| జనాభా (2011) | |
| • మొత్తం | 355 |
| • ర్యాంకు | 120 |
| భాషలు | |
| • అధికారిక | ఒడియా, ఇంగ్లిష్ |
| • ఇతర | తెలుగు, హిందీ |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| పిన్‌కోడ్ | 760001 -760010 |
| టెలిఫోన్ కోడ్ | 0680 |
| వాహన రిజిస్ట్రేషన్ | OR-07/ OD-07 |
| వెబ్‌సైటు | www |
చరిత్ర
బ్రిటిష్ పాలన కాలంలో బరంపురం మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగముగా ఉండేది. 1936లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి కొత్తగా ఆవిర్భవించిన ఒరిస్సా ప్రావిన్స్ లో భాగంగా చెయ్యడంతో ఈ ప్రాంతంలోని తెలుగు ఇంకా ఒడియా ప్రజల మధ్య పెద్ద సంఖ్యలో సంఘర్షనలు జరిగాయి. చివరికి గాంధీజీ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు చక్కబడ్డాయి.
రవాణా సౌకర్యాలు
బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని మరియు దక్షిణ ఒడిషా ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ధి చెందాయి.
రోడ్డు
బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంది. జాతీయ రహదారి 5 (భారతదేశం) (చెన్నై– కోల్‌కతా) మరియు NH-59 (గోపాల్‌పూర్– అహ్మదాబాద్) మరియు ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉంది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.
రైలు
బరంపురం రైల్వేస్టేషను కోల్‌కతా మరియు చెన్నై మహానగరాలను కలుపుతూ సాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్కు అనుసంధానమై ఉంది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాలైన కొత్త ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగలూరు, భువనేశ్వర్, చెన్నై, కటక్, ముంబాయి, నాగ్‌పూర్, పూనా, పూరి, విశాఖపట్నం, కోల్‌కతా, రాయ్‌పుర్, సంబల్‌పుర్ లను సులభంగా చేరుకోవచ్చు.
సముద్రం
ఈ పట్టణంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. అవి అత్యంత పురాతన ఓడరేవు ఐన గోపాల్‌పూర్ మరియు పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ద్వారా నిర్మితమైన శాటిలైట్ రేవు బాహుదా మౌత్ (ముహన్) ఈ రెండు ఓడరేవులు.
ప్రముఖులు
- తాపీ ధర్మారావు నాయుడు - తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబరు 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
- జయంతి కామేశం పంతులు - ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టుపేటలో నివసించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కథకుడు అయిన ఆదిభట్ల నారాయణదాసు గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో ఉపజాత్యష్టకం చెప్పిఉన్నారు
- తుర్లపాటి రాజేశ్వరి ప్రవాసాంధ్ర రచయిత్రి. ఈమె ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంలో ఉంటూ తెలుగు సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నది.
- వరాహగిరి వెంకటగిరి
- పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి
- ఎనుముల సావిత్రీదేవి
- సుభద్రా శ్రీనివాసన్
మూలాలు, ఆధారాలు
- బరంపురం, జయంతి కామేశం పంతులు గురించిన సమాచారం - ఆదిభట్ల నారాయణదాసు గారి నా యెరుక పుస్తకం పేజీలు 27,28,29
- వ్యాసమంజరి (శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి) లో సంపుటం-242,245 పేజీలు
- ఒడిషా నుంచి వ్యాసవారధి- http://m.newshunt.com/india/telugu-newspapers/prabha-news/specialstories/orissa-nunchi-vyaasavaaradhi_34017485/995/c-in-l-telugu-n-aprabha-ncat-Specialstories


