బద్వేలు

బద్వేలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. [1]పిన్ కోడ్ నం. 516 227.

గ్రామ చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

విశ్వ చైతన్య ఆశ్రమం

స్థాపక గురువులు :

  • మంచుకొండ మస్తాన్‌
  • గాలీబు
  • షేక్‌ హుస్సేన్‌
  • నాజర్‌ మస్తాన్‌
  • ఖాదర్‌ (సమాధి 24.1.1931)
  • ఖాజావలి
  • అబ్దుల్‌ అజీజ్‌ పాఖాద్రి

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.

గ్రామములోని విద్యా సౌకర్యాలు

బి.వి.ఆర్. వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల:- ఈ కళాశాలను 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు ప్రారంభించినారు. కడప జిల్లాలో ఇది తొలి వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల. [2]

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

==గ్రామ పంచాయతీ==కొంగలవీడు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

బద్వేలు ప్రాంతం సారవంతమైన మట్టికి ప్రసిద్ధి. అందులోనూ మట్టిపాత్రలు, కుండలకు ఎంతోపేరొందింది. పురాతనమైన బద్వేలు పట్టణంలోని కుమ్మరి కొట్టాలకూ ఒక ప్రత్యేకత ఉంది. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ బానలు, కుండలు, కూజాలు, కాగులు (ధాన్యం భద్రపరచుకునే పెద్ద పాత్రలు) ముంతలు, మూకుళ్లు తయారీ విక్రయంలో శతాబ్దాలుగా పేరొందింది. ఇక్కడ ఇప్పటికీ సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే మట్టి పాత్రలకు జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం సరిహద్దు గ్రామాల వరకు సరఫరా అవుతాయి. మట్టి పాత్రల పరిమాణం అనుసరించి ధర ఉంటుంది. వేసవిలో ఇక్కడి తయారయ్యే బానలను గిరాకీ ఎక్కువ. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టిపాత్రలను వంటలకు వినియోగిస్తున్నారు. కుండ, బాన, దుత్త (బిందె) లాంటివి ఎక్కువగా తయారు చేస్తుండటంతో ఈ వీధికి కుమ్మరికొట్టాలు అని పేరొచ్చింది.

గ్రామ జనాభా

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కడప; 2014,మే-30; 6వపేజీ.

[2] ఈనాడు కడప; 2016,నవంబరు-27; 11వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.