బంధువు

రక్త సంబంధము కలిగిన మానవులు, ఇక్కడ రక్త సంబధమును విస్తృతార్థములో ఉపయోగించాలి. మన సమాజములో సాధారణంగా వ్యక్తికి గానీ కుటుంబము నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబముతో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ బంధువులుగా గుర్తిస్తాము.

చుట్టరికాలు

*అమ్మ : తల్లి. *అయ్య: తండ్రి. *నాన్న : తండ్రి. *అన్న: వయసులో పెద్ద ఐన సహోదరుడు. *తమ్ముడు: వయసులో చిన్న ఐన సహోదరుడు. *అక్క: వయసులో పెద్ద ఐన సహోదరి. *చెల్లెలు: వయసులో చిన్న ఐన సహోదరి. *తాత: తల్లి/తండ్రి యొక్క తండ్రి. *అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి. *నాయనయ్య: తండ్రి యొక్క తండ్రి. *నాయనమ్మ: తండ్రి యొక్క తల్లి. *ముత్తాత: తాత యొక్క తండ్రి. *తాతమ్మ: తాత యొక్క తల్లి. *జేజెమ్మ: నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి *పెద్దనాన: తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త. *పెద్దమ్మ: తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య. *మేనత్త: తండ్రి యొక్క సోదరి. *మేనమామ: తల్లి సోదరుడు. *మామ / మామయ్య: మేనత్త యొక్క భర్త. *అత్త / అత్తయ్య: మేనమామ భార్య. *మామగారు: భర్త/భార్య యొక్క తండ్రి. *అత్తగారు: భర్త/భార్య యొక్క తల్లి. *పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య. *బాబాయి: తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త. *బావ: తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు. *బావమరిది: భార్య యొక్క సోదరుడు. *మరిది: తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు. *తోడల్లుడు: భార్య యొక్క సహోదరి భర్త. *మరదలు: తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య. *వదిన: తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య. *ఆడపడుచు/ఆడబిడ్ద: భర్త యొక్క సహోదరి *తోడికోడలు: భర్త యొక్క సహోదరుని భార్య. *భర్త: వివాహమాడిన పురుషుడు. *భార్య: వివాహమాడిన స్త్రీ. *కోడలు: కుమారుని భార్య. *మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు. *అల్లుడు: కుమార్తె యొక్క భర్త. *మేనల్లుడు: భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.

  • తల్లి : అమ్మ, మాతరం
  • తండ్రి : నాన్న : అయ్య, పితరం
  • అన్న : వయసులో పెద్ద ఐన సహోదరుడు.
  • తమ్ముడు : వయసులో చిన్న ఐన సహోదరుడు.
  • అక్క : వయసులో పెద్ద ఐన సహోదరి.
  • చెల్లెలు : వయసులో చిన్న ఐన సహోదరి.
  • తాత : తల్లి/తండ్రి యొక్క తండ్రి.
  • పితామహుడు : తండ్రి యొక్క తండ్రి., తాత
  • మాతామహుడు : తల్లి యొక్క తండ్రి, తాత
  • అమ్మమ్మ : తల్లి యొక్క తల్లి.
  • నాయనయ్య : తండ్రి యొక్క తండ్రి.
  • నాయనమ్మ : తండ్రి యొక్క తల్లి, మామ్మ, పితామహీం
  • ముత్తాత : తాత యొక్క తండ్రి,. ప్రపితామహం
  • తాతమ్మ : తాత యొక్క తల్లి, ప్రపితామహీం
  • జేజెమ్మ : నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
  • సవతి తల్లి : సాపత్నీమాతరం
  • పెదనాన్న : తండ్రి యొక్క అన్న మరియు అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
  • పెద్దమ్మ : తల్లి అక్క మరియు అక్క వరస ఐన ఇతర బందువులు, తండ్రి యొక్క అన్న భార్య.
  • మేనత్త : తండ్రి యొక్క సోదరి.
  • మేనమామ : తల్లి సోదరుడు.
  • మామ / మామయ్య : మేనత్త యొక్క భర్త.
  • అత్త / అత్తయ్య : మేనమామ భార్య.
  • మామగారు : భర్త/భార్య యొక్క తండ్రి.
  • అత్తగారు : భర్త/భార్య యొక్క తల్లి.
  • పిన్ని: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
  • బాబాయి : తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
  • బావ : తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
  • బావమరిది : భార్య యొక్క సోదరుడు.
  • మరిది : తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
  • తోడల్లుడు : భార్య యొక్క సహోదరి భర్త.
  • మరదలు : తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
  • వదిన : తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
  • ఆడపడుచు /ఆడబిడ్ద : భర్త యొక్క సహోదరి
  • తోడికోడలు/తోటికోడలు : భర్త యొక్క సహోదరుని భార్య.
  • భర్త: వివాహమాడిన పురుషుడు.
  • భార్య : వివాహమాడిన స్త్రీ.
  • కోడలు/కోడలుగారు : కుమారుని భార్య.
  • మేనకోడలు: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
  • అల్లుడు/అల్లుడుగారు: కుమార్తె యొక్క భర్త.
  • మేనల్లుడు : భర్త సహోదరి కొడుకు, భార్య సహోదరుని కొడుకు.

దగ్గరి బంధువులు

ఒక వ్యక్తి/కుటుంబానికి సంబంధించిన సంతానము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి సంతానము దగ్గరి బంధువులుగా పేర్కొంటాము. పైన పేర్కొనబడిన చుట్టరికం వున్న వాళ్ళని మనము దగ్గరి బంధువులు అంటాము.

దూరపు బంధువులు

ఈ దగ్గరి బంధువుల బంధువులు, లేదా తాత, ముత్తాతల దగ్గరి బంధువులు మనకు దూరపు బంధువులు అయ్యే అవకాశం ఉంది.

లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.