ఫకృద్దీన్ అలీ అహ్మద్
ఫక్రుద్దీన్ అలీ అహమద్ (మే 13, 1905 – ఫిబ్రవరి 11, 1977) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు.[1][2] ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీలో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.

ఫక్రుద్దీన్ అలీ అహమద్ సమాధి
| ఫకృద్దీన్ అలీ అహ్మద్ | |||
భారత 5వ రాష్ట్రపతి | |||
| పదవీ కాలము 24 ఆగస్టు 1974 – 11 ఫిబ్రవరి 1977 | |||
| ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
|---|---|---|---|
| ఉపరాష్ట్రపతి | బసప్ప దానప్ప జట్టి | ||
| ముందు | వి. వి. గిరి | ||
| తరువాత | బసప్ప దానప్ప జట్టి (తాత్కాలిక) | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1905 మే 13 ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత భారత దేశము) | ||
| మరణం | 1977 ఫిబ్రవరి 11 (వయసు 71) కొత్త ఢిల్లీ, ఢిల్లీ, భారత దేశము | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | బేగం అబిదా అహ్మద్ | ||
| సంతానము | 3 | ||
| పూర్వ విద్యార్థి | సెయింట్ కేథరీన్స్ కళాశాల, కేంబ్రిడ్జి సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ | ||
| వృత్తి | న్యాయవాది | ||
| మతం | ఇస్లాం | ||
మూలాలు
- Former Presidents ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్.
- ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905-1977): జీవిత చరిత్ర ఆర్.ఆర్.టి.సి., సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (భారత దేశం)]].
ఇవి చూడండి
- ఎం.ఎ.నాయుడు రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975
- అత్తర్ చంద్ రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975.
- జనక్ రాజ్ జై (2003). "ఫక్రుద్దీన్ అలీ అహ్మద్". ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, 1950-2003. దయ బుక్స్. p. 101. ISBN 81-87498-65-X.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.