ప్రసాదంపాడు

ప్రసాదంపాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామము. ప్రసాదంపాడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ యొక్క పరిసర ప్రాంతం.[1] గ్రామం అన్న పేరే గాని ఇది ప్రస్తుతం విజయవాడ నగరంలో కలిసిపోయింది.

ప్రసాదంపాడు
  రెవిన్యూ గ్రామం  
ప్రసాదంపాడు
అక్షాంశరేఖాంశాలు: 16.519602°N 80.689558°E / 16.519602; 80.689558
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి ఈడ్పుగంటి నళిని
జనాభా (2011)
 - మొత్తం 13,941
 - పురుషుల సంఖ్య 7,051
 - స్త్రీల సంఖ్య 6,890
 - గృహాల సంఖ్య 3,860
పిన్ కోడ్ : 521108
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

మెట్రోపాలిటన్ ప్రాంతం

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[3][4]

గ్రామ భౌగోళికం

[5] సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

రామవరప్పాడు 1 కి.మీ, నాగార్జున నగర్ 1 కి.మీ, శ్రీ రామచంద్ర నగర్ 1 కి.మీ, ఎనికేపాడు 2 కి.మీ, శ్రీనివాస నగర్ బ్యాంకు కాలని

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

విజయవాడ, ఎ.పి.ఎస్.ఆర్టీ.సి పెద్ద రోడ్డురవాణా సౌకర్యం గల పెద్ద సంస్థ

రైలు వసతి

  • విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
  • గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[6][7] వివిధ పాఠశాలలు తెలుగు మరియు ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ప్రసాదంపాడుకు చెందిన శ్రీ కె.భీంకుమార్, 1992 వ సంవత్సరంలో, నిడమానూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 10వ తరగతి చదివినారు. వీరికి ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టరేటు పట్టాను అందజేసినారు. [4] ఎస్.పి.పబ్లిక్ పాఠశాల, సెయింట్ ఆన్స్ హైపాఠశాల, వివేకానంద కాన్వెంట్ పాఠశాల, ఎస్.కె.విద్యావాణి, సి.బి.సి.ఎన్.చి.ఎ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రసాదంపాడు

గ్రామపంచాయతీ

ఈ గ్రామపంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఈడ్పుగంటి నళిని సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కొమ్మా కోటేశ్వరరవు ఎన్నికైనారు. [1]

గ్రామము పట్టణం లోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

  1. ప్రసాదంపాడు గ్రామంలోని బాలపేరంటాళ్ళు జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో వైభవంగా నిర్వహించెదరు. కార్యక్రమాలలో భాగంగా అమ్మవారికి భక్తులు, గండదీపాలతో మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో భాగంగా అమ్మవారికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో గ్రామోత్సవం నిర్వహించెదరు. రామవరప్పాడుతోపాటు, ప్రసాదంపాడులోని పలు వీధులలో ఈ గ్రామోత్సవం సాగుతుంది. [2]
  2. శ్రీ మహాలక్ష్మి, మహా గణపతి, మహా సరస్వతీదేవి ఆలయం.
  3. శ్రీ షిర్డీసాయి మందిరం.

గ్రామ విశేషాలు

ప్రసాదంపాడు గ్రామాన్ని మండల పరిషత్తు అధికారులు, మోడల్ గ్రామంగా ఎంపిక చేసారు. ఈ గ్రామాన్ని సోలార్ గ్రామంగా గూడా ఎంపిక చేసారు. దీనితో కేంద్ర ప్రభుత్వం వారు, ఈ గ్రామస్థులకు సోలార్ పరికరాలను 50% రాయితీతో అందజేసెదరు. [3]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 13,941 - పురుషుల సంఖ్య 7,051 - స్త్రీల సంఖ్య 6,890 - గృహాల సంఖ్య 3,860
ప్రసాదంపాడు మెయిన్ రోడ్‌పై దృశ్యం

మూలాలు

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఆంగ్లం). Retrieved 27 March 2017.
  3. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Retrieved 27 March 2017.
  4. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada-Rural/Prasadampadu". Retrieved 18 June 2016. External link in |title= (help)
  5. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Retrieved 7 November 2016.
  6. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Retrieved 7 November 2016.

[1] ఈనాడు విజయవాడ/గన్నవరం; 2014,జనవరి-1; 3వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,మార్చి-18; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జులై-24; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,జులై-6; 4వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.