ప్రమతి

ప్రమతి భృగు వంశంలోని దివ్య తపస్వియైన మహర్షి. ఇతడు చ్యవన మహర్షి మరియు సుకన్యల పుత్రుడు. ఘృతాచి అను అప్సరస ఇతనిని వలచి యాతని ఆశ్రమమునకు వచ్చి సేవచేయుచుండెను. కొంతకాలమునకు ఆతనికి ఆమెపై అనురాగము ఉదయించి పిదప ఘృతాచి యందు సుపుత్రుని పొందెను. అతడు రురుడు అను పేరుతో పెరుగుచు ధర్మాత్ముడు, తపశ్శాలి, విద్యావంతుడు, మన్మథోపముడై వెలుగొందెను.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.