ప్రభుదేవా

ప్రభుదేవా ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు మరియు దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఇరవై ఐదు సంవత్సరాల పైగా సినీ జీవితంలో ప్రభుదేవా పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు.[1] అభిమానులు ఇతన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు.[2] తండ్రి సుందరం మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవా టీనేజీ వయసు నుంచే నృత్య దర్శకత్వం చేయనారంభించాడు. తర్వాత నటుడిగా మారి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా, సహనటుడిగా కనిపించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రభు సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్య కళాకారులే.

ప్రభుదేవా
జననంప్రభుదేవా సుందరం
(1973-04-03) 1973 ఏప్రిల్ 3
మైసూర్, కర్నాటక, భారత్
వృత్తినటుడు, దర్శకుడు, నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1988 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిరామలత, (1995-2010)
తల్లిదండ్రులుసుందరం మాస్టర్
బంధువులురాజు సుందరం (సోదరుడు)
నాగేంద్ర ప్రసాద్ (సోదరుడు)

బాల్యం, విద్య

కర్నాటక లోని మైసూర్ లో ఏప్రిల్ 3, 1973 లో జన్మించాడు. చెన్నై లో పెరిగాడు. చిన్నతనంలో ఫుట్ బాల్ మీద ఆసక్తి ఉండేది. తండ్రి సుందరం మాస్టారు పేరు పొందిన నృత్య దర్శకుడు. ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నటులు, నృత్యదర్శకులే.

సినీ జీవితం

నృత్య దర్శకుడిగా

తండ్రి నృత్య దర్శకుడు కావడంతో ప్రభుదేవాపై ఆ ప్రభావం పడింది. టీనేజ్ లో ఉండగానే తండ్రితో కలిసి సినిమా చిత్రీకరణకు వెళ్ళేవాడు. తన చదువు సరిగా సరిగా సాగడం లేదని తెలిసి తండ్రి దగ్గరే ఒకటిన్నర ఏడాదిపాటు సహాయకుడిగా ఉన్నాడు. తర్వాత లక్ష్మీనారాయణ మాస్టర్, ధర్మరాజు మాస్టర్ దగ్గర కూడా నృత్యంలో మెళకువలు నేర్చుకున్నాడు.

నటుడిగా

తమిళంలో వచ్చిన ఇదయం, జెంటిల్మేన్ సినిమాల్లో కొన్ని పాటల్లో తెరపైన కనిపించాడు. తర్వాత దర్శకుడు పవిత్రన్ ప్రభుదేవాను ఇందు అనే చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. తర్వాత వచ్చిన ప్రేమికుడు మంచి విజయాన్ని అందుకుంది.

వ్యక్తిగతం

ఇతడు రామలతను వివాహం చేసుకొన్నాడు, వీరికి ఇద్దరు కొడుకులు. సినీనటి నయనతార ను ప్రేమించుట వలన ఇద్దరు గొడవపడి విడాకులు పొందారు.

అవార్డులు

నృత్య దర్శకత్వం వహించిన సినిమాలు

  • జగదేక వీరుడు అతిలోకసుందరి

దర్శకునిగా

సిద్ధార్థ్ కథానాయకుడిగా ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాట్యం ప్రధానాంశంగా ఎం. ఎస్. రాజు నిర్మించిన పౌర్ణమి చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు.

మూలాలు

  1. Photos: prabhu-deva.jpg. Mid-day.com. Retrieved on 27 September 2013.
  2. ఎర్రకోట, నర్శిమ్ (2 Sep 2018). "ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అయ్యేవాణ్ని". eenadu.net. ఈనాడు. Archived from the original on 4 Sep 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.