ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఆంగ్లం : World Health Organisation (WHO) : 1948 ఏప్రిల్ 7 వ సంవత్సరంలో స్థాపించబడింది. ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఏర్పాటు చేయబడింది.

జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం

ధ్యేయం

మానవుడికి సరికొత్త వైద్యసదుపాయాలు అందజేయడం.

స్థాపన

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్య రాజ్య సమితిచే నడుపబడే సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల అమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (1948 ఏప్రిల్ 7) నాడు ప్రారంభిచబడింది.[1]

కార్యకలాపాలు

అంతర్జాతీయ సమన్వయంతో పాటు ఈ ఆరోగ్య సంస్థ, సార్స్, మలేరియా మరియు ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమయిన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నది. కొన్ని ఏళ్ళపాటు కష్టపడిన తర్వాత, 1979 లో మశూచి (స్మాల్ పాక్స్) (అమ్మవారు) వ్యాధిని సమూలంగా నివారించినట్టు ఈ సంస్థ పేర్కొన్నది. ఈ విధంగా మానవుని ప్రయత్నాల ద్వారా నివారించబడిన మొదటి వ్యాధిగా మశూచి (స్మాల్‌పాక్స్) చరిత్రలో నిలిచి పోయింది. మలేరియా మరియు సిస్టోసోమియాసిస్కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతున్నది. పోలియోను సమూలంగా నిర్మూలంచే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తున్నది.

సభ్యత్వం

196 దేశాలు ప్రస్తుత సభ్యదేశాలు, వీటిల్లో ఒక్క లీచ్‌టెన్‌స్టెయిన్ తప్ప అన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు మరియు 2 అన్య దేశాలు (నియూ and the కుక్ దీవులు) ఉన్నాయి.

ప్రాంతీయ కార్యాలయాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాలు:
  ఆఫ్రికా; స్థావరం: Brazzaville, కాంగో
  Eastern Mediterranean; స్థావరం: కైరో, ఈజిప్టు
  యూరోప్; స్థావరం: కోపెన్ హాజెన్, డెన్మార్క్
  South East ఆసియా; స్థావరం: కొత్త ఢిల్లీ, భారత దేశం
  Western Pacific; స్థావరం: మనీలా, ఫిలిప్పీన్స్

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Chronicle of the World Health Organization, April 1948" (PDF). World Health Organization. p. 54. Retrieved 2007-07-18.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.