ప్రజాతి
ప్రజాతి (ఆంగ్లం Genus) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామకరణ పద్ధతిలో కొన్ని జాతులను ఒక సమూహంలో ఉంచుతారు. ఈ జాతులన్నిటికి కొన్ని సాధారణ లక్షణాలుంటాయి. ఈ విధమైన సమూహాన్ని 'ప్రజాతి' అంటారు. కొన్ని సాధారణ లక్షణాలున్న ప్రజాతులను కుటుంబములో ఉంచుతారు.

The hierarchy of scientific classification
ప్రజాతి పేరు
ఒక మొక్క ప్రజాతి పేరు లాటినీకరణం చేయబడిన నామవాచక రూపం. ఇది పెద్ద అక్షరాలతో (Capital latter) తో ప్రారంభమవుతుంది.
- కొన్ని ప్రజాతుల పేర్లు ప్రముఖ శాస్త్రవేత్తల గౌరవ సూచకంగా ఇవ్వబడ్డాయి.
ఉదాహరణ :
- కొన్ని ప్రజాతుల పేర్లు ఆ మొక్కలను కనుగొన్న దేశాల వ్యవహారిక భాష నుండి వచ్చాయి.
ఉదాహరణ :
- కొన్ని ప్రజాతుల పేర్లు రెండు, మూడు గ్రీకు లేదా లాటిన్ పదాల కలయిక వల్ల ఏర్పడ్డాయి.
ఉదాహరణ :
- పాలిగాల = Poly + Gala
- హైగ్రోఫిలా = Hygro + Phila
- ఆస్టర్ కాంత = Aster + Cantha
- ల్యూకాడెండ్రాన్ = Leuca + Dendron
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.