పోతుమర్రు (కలిదిండి)
పోతుమర్రు కృష్ణా జిల్లా, కలిదిండి మండలాలికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 444., ఎస్.టి.డి.కోడ్ = 08677.
| పోతుమర్రు (కలిదిండి) | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కలిదిండి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 3,781 |
| - పురుషుల సంఖ్య | 1,891 |
| - స్త్రీల సంఖ్య | 1,890 |
| - గృహాల సంఖ్య | 1,094 |
| పిన్ కోడ్ | 521444 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
ఈ గ్రామపరిధిలోని గొల్లగూడేనికి చెందిన, శ్రీ వెంకటగణేశ్వరరావు+వెంకటవీరమ్మ దంపతుల కుమారుడైన, శ్రీ బత్తిన నాగార్జున, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డారు. వీరు తమ గ్రామంలో "మానవ సేవా సంస్థ" ద్వారా రు. 6 లక్షల విరాళంతో "అక్షరాలయ" పేరుతో అంగనవాడీ కేంద్రాన్ని నిర్మించి, అక్టోబరు 5, 2013 న ప్రారంభింపజేశారు. వీరు స్థలంతోపాటు, భవననిర్మాణానికి అవసరమైన ఖర్చులు విరాళంగా సమకూర్చి పేదవిద్యార్ధులకు చేయూతనిచ్చారు. వీరికి "maanavaseva.org" అను వెబ్ సైటు ఉన్నది. వీరు "అక్షరాలయ" పేరుతో అంగనవాడీ భవనాన్ని నిర్మించి, అక్టోబరు 5, 2013న స్త్రీ,శిశు సంక్షేంశాఖ వారికి అప్పగించారు. [1]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4041.[1] ఇందులో పురుషుల సంఖ్య 2028, స్త్రీల సంఖ్య 2013, గ్రామంలో నివాస గృహాలు 998 ఉన్నాయి.