పేరాల
పేరాల : చీరాల మండలములోని ఒక గ్రామము.[1] పిన్ కోడ్ నం.523 157., ఎస్.టి.డి.కోడ్ = 08594.
| పేరాల | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() పేరాల |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.820167°N 80.35037°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | చీరాల |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | .523157 |
| ఎస్.టి.డి కోడ్ | 08594 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాల
ఈ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కౌతవరపు రాజేంద్రప్రసాద్, ఐదుపైసల నాణేలతో వివిధ రకాల కళాకృతులను రూపొందించినండుకు, "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్థానం సంపాదించుకున్నారు. గతంలో వీరు ఐదుపైసల నాణేలతో చార్మినార్, శివలింగం, ఓడ, కంటివైద్యశాల, వి.ఆర్.ఎస్. మరియూ వై.ఆర్.ఎన్. కలాశాలల నమూనా తయారుచేసినందుకు, ఈ అరుదైన గుర్తింపు లభించినది. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గూడా వీరిపేరు నమోదయినది. కళారత్న, ఆంధ్రరత్న తదితర పురస్కారాలతోపాటు, ఈయనకు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యత్వం గూడా లభించినది. [1]
గ్రామంలో మౌలిక వసతులు
బ్యాంకులు
భారతీయ స్టేట్ బ్యాంక్, పేరాల శాఖ.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- పునుగు శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవాలయం.
- శ్రీ మదనగోపాలస్వామివారి దేవాలయం.
ఈ రెండు ఆలయాలదీ 300 సంవత్సరాల చరిత్ర. ఆ రోజులలోనే దాతలు నిర్వహణకై శివాలయానికి 8.35 ఎకరాలూ, మదనగోపాలునికి 12 ఎకరాలూ నిర్వహణకు, భూమిని విరాళంగా అందజేసినారు. ఈ భూములు అన్యాక్రాంతమై, ఆలయాల నిర్వహణ తీరు బాగుగా లేదు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
వెలుపలి లంకెలు
[1] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-18; 11వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-21; 1వపేజీ.
