పెరిశేపల్లి
పెరిశేపల్లి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 157. ఎస్.టి.డి.కోడ్ = 08674.
| పెరిశేపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521157 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |

గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
పామర్రు నుండి జుజ్జవరం, మీదుగా పసుమర్రు గ్రామము తరువాత పెరిశేపల్లి ఉంది. పామర్రు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుమారు 75 ఇండ్లు ఉన్నాయి.
సమీప గ్రామాలు
సమీప మండలాలు
రవాణా సౌకర్యాలు:
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మందల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పెరిశేపల్లి
గ్రామంలో మౌలిక వసతులు
త్రాగునీటి సౌకర్యం
గ్రామంలోని చెరువు నీటిని శుద్ధిచేసి, త్రాగునీటిగా గ్రామస్థులకు అందించుటకై, ఈ గ్రామ దత్తత స్వీకర్త శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి, 13 లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలో, ఒక నీటిశుద్ధికేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రాన్ని, 2017,ఫిబ్రవరి-27న ప్రారంభించారు. [5]
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ చట్టం 3 (2) (ఇ) ప్రకారం, కాపవరం పంచాయతీ పేరును, ఇటీవల, పెరిశేపల్లి పంచాయతీగా పేరు మార్పుచేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వరకు కాపవరం పంచాయతీ పరిధిలో ఉన్న మల్లవరం, సఫ్తార్ ఖాన్ పాలెం, పెరిశేపల్లి గ్రామాలు ఇకపై పెరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనికి వచ్చును. [2]
2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చాపరాల నాగవల్లి సర్పంచిగా ఎన్నికైనారు. [4]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ అలివేలు మంగా, పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి పవిత్రోఈత్సవాలు 2016, మార్చ్-10 నుండి 13 వరకు నిర్వహించెదరు. [3] ఈ ఆలయ రజతోత్సవాలు 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు, రామానుజ జియ్యర్‌స్వామి పర్యవేక్షణలో, వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్స్య సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు. రెండవ రోజైన సోమవారంనాడు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించారు. మూడవరోజైన మంగళవారంనాడు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం యాగశాలలో ద్వారా తోరణం, ధ్వజ, కుంభ, అగ్ని ఆరాధన నిర్వహించారు. అనంతరం హోమం, ఆరగింపు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ఈ ఆలయ రజతోత్సవాలలో భాగంగా, 22వతేదీ బుధవారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ల విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారలను దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ రజతోత్సవాలు 24వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [4] ఈ ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనవి.. ఈ సంద్రభంగా అంకురార్పణ, నిత్యహోమాలు నిర్వహించారు. 27న శ్రీవారి కళ్యాణం, 28న గరుడోత్సవం, మార్చ్-1న అన్నసమారాధన, 2న తెప్పోత్సవం నిర్వహించారు. [4]&[6]
గ్రామంలో ప్రధానమైన పంటలు
గామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం ప్రధానవృత్తి.
గ్రామ ప్రముఖులు
వడ్డెర చండీదాస్, ప్రముఖ రచయిత అసలు పేరు "డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు", (తండ్రిపేరు: చెరుకూరి చంచ్రమౌళి) తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. చండీదాస్ 2005, జనవరి 30న మరణించారు.
- ప్రముఖ వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఈ వూరివారే
గ్రామ విశేషాలు
ఈ గ్రామానికి చెందిన శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు అను రైతు, 2016 సంవత్సరానికి గాను, మండలంలో ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2016, జనవరి-12న పామర్రులో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో అందుకున్నారు. వీరు 2015 లో గూడా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. వీరు 2012లో నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు క్లబ్ అధ్యక్షులుగా జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. [1]
ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి దత్తత తీసుకున్నారు. [5]
గ్రామం దృశ్యమాలిక
బడి
వెంకటేశ్వరస్వామి గుడి
డోకిపర్రు రోడ్డు
పశువుల ఆసుపత్రి
పంచాయితీ ఆఫీసు
పాలకేంద్రం
కళ్యాణ మంటపం
గుడి
కంప్యూటర్ స్కూలు
బస్ షెల్టర్
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-15; 28వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-3; 17వఫేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-5; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-25; 1వఫేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-28; 2వఫేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చ్-3; 2వపేజీ.
- [www.te.wikipedia.org "www.te.wikipedia.org"] Check
|url=value (help). Retrieved 30 June 2016.