పెన్నా నది


పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదెశపు ఒక నది. పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

పెన్నా లేదా పెన్నార్
ಪೆನ್ನಾರ್
పెన్నా (పెన్నార్)
పెన్నా, పెన్నేరు
River
Map showing the river.
దేశం India
రాష్ర్టాలు కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్
Region దక్షిణ భారత్
ఉపనదులు
 - ఎడమ Jayamangali, Kunderu, Sagileru
 - కుడి Chitravati, Papagni, Cheyyeru
City నెల్లూరు
Mouth
 - location Utukuru into Bay of Bengal, Nellore, Andhra Pradesh, India
 - ఎత్తు 0 m (0 ft)
పొడవు 597 km (371 mi)
పరివాహక ప్రాంతం 55,213 km2 (21,318 sq mi)
Discharge for Nellore (1965–1979 average), max (1991)
 - సరాసరి 200.4 m3/s (7,077 cu ft/s) [1]
 - max 1,876 m3/s (66,250 cu ft/s)
 - min 0 m3/s (0 cu ft/s)


పెన్నా ప్రవాహం, ఉపనదులు

పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్ అప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.

పెన్న నది పరివాహక రాజ్యాలు, కోటలు

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.

జొన్నవాడ వద్ద పెన్నానది
పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము
తూర్పు కొండల వద్ద పెన్నానది
గండికోట వద్ద పెన్నానది

బయటి లింకులు

  1. Kumar, Rakesh; Singh, R.D.; Sharma, K.D. (2005/09/10). "Water Resources of India" (PDF). Current Science (in English). Bangalore: Current Science Association. 89 (5): 794–811. Retrieved 2013-10-13. Check date values in: |date= (help)CS1 maint: Unrecognized language (link)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.