పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3894 ఇళ్లతో, 14374 జనాభాతో 3880 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7098, ఆడవారి సంఖ్య 7276. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3659 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 326. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588859[1].పిన్ కోడ్: 521190.
| పెనుగంచిప్రోలు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పెనుగంచిప్రోలు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీమతి చింతల శ్రీలక్ష్మి |
| జనాభా (2011) | |
| - మొత్తం | 14,374 |
| - పురుషుల సంఖ్య | 25,782 |
| - స్త్రీల సంఖ్య | 26,029 |
| - గృహాల సంఖ్య | 14,262 |
| పిన్ కోడ్ | 521 190 |
| ఎస్.టి.డి కోడ్ | 08678 |
| పెనుగంచిప్రోలు | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనుగంచిప్రోలు మండలం యొక్క స్థానము |
|
![]() పెనుగంచిప్రోలు |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.9167°N 80.2500°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | పెనుగంచిప్రోలు |
| గ్రామాలు | 13 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 50,695 |
| - పురుషులు | 25,551 |
| - స్త్రీలు | 25,144 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 57.08% |
| - పురుషులు | 66.59% |
| - స్త్రీలు | 47.48% |
| పిన్ కోడ్ | 521190 |
గ్రామ చరిత్ర
పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా పిలువబడినది. పెనుగంచిప్రోలు అను పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయములు ఉండేవని అంటారు. అయితే కాల క్రమలో ఈ ఊరి ప్రక్కనే ప్రవహించుచున్న మునియేరు వరదల వల్ల ఆ ఊరు మరియు ఆ దేవాలయములు భూగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఇప్పటికనీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్ధంభాలు నీటిలో కనిపిస్తాయి. కొన్ని బయటకు కూడా కనిపిస్తాయి. కాని వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరిలోనున్న ఆదినారాయణస్వామి మరియు గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే. పెనుగ్రంచిపోలు సంస్థానానికి సంబంధిచిన అనేక తవ్వకాలలో అనేక శాసనాలు లభ్యమయ్యాయి.
సమీప గ్రామాలు
ముండ్లపాడు 3 కి.మీ, లింగగూడెం 3 కి.మీ, కొల్లికుల్ల 4 కి.మీ, వేమవరం 5 కి.మీ, ముచ్చింతాల 5 కి.మీ,నందిగామ16 కి.మీ, తోటచర్ల 10 కి.మీ
సమీప మండలాలు
సమాచార, రవాణా సౌకర్యాలు
పెనుగంచిప్రోలులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేటనుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. విజయవాడ రైల్వేస్టేషన్ 62 కి.మీ దూరంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. సమీప బాలబడి జగ్గయ్యపేటలో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల జగ్గయ్యపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగ్గయ్యపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.
గ్రామంలోని మౌలిక వసతులు
- ప్రాథమిక వైద్యశాల.
- అంగనవాడీ కేంద్రం.
- ఆంధ్రా బ్యాంక్.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
పెనుగంచిప్రోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
అందమైన మునేరు నది, చెరువు, నాగార్జున సాగర్ కాలువలు ఈ ఊరి వ్యవసాయానికి జీవానాధారాలు.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
గ్రామ పంచాయతీ
2013 జూలై 28లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చింతల శ్రీలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ సీతారామయ్య ఎన్నికైనారు. అనంతరం పంచాయతీ పాలకవర్గం ఏర్పడగానే, తొలి తీర్మానంలోనే, గ్రామంలోని తుఫాన్ కాలనీ మరియూ బంగారు కాలనీలలోని అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులకు మోక్షం కలిగించాలని ఆమోదముద్ర వేసినారు. వెంటనే పనులు ప్రారంభించి ఆరు నెలలలో పనులు పూర్తి చేసి, అందరి ప్రశంసలనందుకున్నారు. ఈ రెండు కాలనీలలో ఉన్న రహదారుల మీద, వర్షం వస్తే కనీసం నడిచేటందుకు గూడా వీలుపడేదికాదు. ఈ రహదారులను 15 లక్ష్ల రూపాయలతో అభివృద్ధి పరచినారు. ఇదిగాక, మరికొన్ని కాలనీలలో రహదార్లకు మొదటి విడతగా గ్రావెల్ పరిచినారు. మరి కొన్నిటిని సిమెంటు రహదారులుగా అభివృద్ధిచేసినారు. తొలి ఏడాదిలోనే అంతర్గత రహదారుల అభివృద్ధికి రు.30 లక్షలు వెచ్చించినారు. ] [3]==గ్రామంలోని దర్శనీయ స్థలాలు/ప్రార్ధనా ప్రదేశాలు==
శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం
ఈ గ్రామంలో శ్రీ తిరుపతమ్మ తల్లి గ్రామ దేవత తిరునాళ్లు బాగా జరుగుతాయి. గ్రామంలో 101 దేవాలయలు ఉన్నాయి. తిరుపతమ్మ దేవాలయము రాష్ట్రములో 11 వ స్థానం, 9 వ నంబరు జాతీయ రహదారి నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయ ఆవరణలోనే అంకమ్మ అమ్మవారు వెలసినారు. ఈ ఆలయానికి పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, సుబ్బాయిగూడెం గ్రామాల పరిధిలో 35 ఎకరాల వ్యవసాయ భూములు మాన్యం భూములుగా ఉన్నవి. [5]
ఇతర దేవాలయాలు
- ప్రసిద్ధి చెందిన శ్రీ ధర్మపురి యోగానంద నృసింహస్వామివారి దేవాలయం.
- అతి పురాతనమైన రుక్మిణి, గోదా సమేత గోపాలస్వామివారి దేవాలయం.
- పడమటి బజారున పురాతన ఆదినారాయణ స్వామివారి దేవాలయం.
- శ్రీ శంభులింగేశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ రామాలయం:- ఈ ఆలయం స్థానిక జమ్మిచెట్టు కూడలి (సెంటర్) లో ఉన్నది. ఈ ఆలయానికి అనుబంధంగా, 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, ఒక కళ్యాణ మండపం ప్రారంభించినారు. [4]
- శ్రీ వరలక్ష్మీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయ ఆవరణలో, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. [6]
- శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయం:- స్థానిక శాలిగడ్డపై ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2017,ఆగష్టు-8వతేదీ మంగళవారంనాడు ప్రారంభమైనది. [11]
సమీప దేవాలయాలు

- విజయవాడ - కనకదుర్గ గుడి,
- వేదాద్రి నారసింహ క్షేత్రం
- మోపిదేవి
- శ్రీకాకుళం (ఘంటసాల) - ఆంధ్ర మహవిష్ణువు క్షేత్రం
- కొల్లేటికోట - పెద్దింట్లమ్మ
- నెమలి - వేణుగోపాలస్వామి
- పెదకళ్ళేపల్లి - నాగేశ్వరాలయం
- ఆకిరిపల్లి - వ్యాఘ్రనరసింహస్వామి
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
పెనుగంచిప్రోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 446 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 871 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 33 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 96 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 76 హెక్టార్లు
- బంజరు భూమి: 81 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 2273 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1544 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 886 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
పెనుగంచిప్రోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 127 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 659 హెక్టార్లు
- చెరువులు: 89 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 11 హెక్టార్లు
ఉత్పత్తి
పెనుగంచిప్రోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
పారిశ్రామిక ఉత్పత్తులు
బియ్యం, పప్పులు
చేతివృత్తులవారి ఉత్పత్తులు
కుండలు
ప్రధాన వృత్తులు
గ్రామం పాడి పంటలకు, వ్యవసాయమనకు పేరు గాంచినది.
గ్రామ ప్రముఖులు
- భండారు అచ్చమాంబ
- దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య
- కొమర్రాజు లక్ష్మణరావు
- కర్ల లింగయ్య బుర్రకథ కళాకారులు.
- పి.వి.అప్పాజీ"ఫార్మస్యూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా" (ఫార్మకిల్స్) కు డైరెక్టరు జనరలుగా ఉన్న డాక్టర్ పి.వి.అప్పాజీ గారి స్వగ్రామం ఈ వూరే. [2]
== చిత్ర మాలిక ==
పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ మరియు గొపయ్య దేవాలయము
గ్రామాలు
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు :[2]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అనిగండ్లపాడు | 2,028 | 8,238 | 4,121 | 4,117 |
| 2. | గుమ్మడిదుర్రు | 792 | 3,239 | 1,603 | 1,636 |
| 3. | కొల్లికుల్ల | 329 | 1,317 | 683 | 634 |
| 4. | కొనకంచి | 907 | 3,481 | 1,761 | 1,720 |
| 5. | లింగగూడెం | 423 | 1,831 | 916 | 915 |
| 6. | ముచ్చింతాల | 540 | 2,426 | 1,224 | 1,202 |
| 7. | ముండ్లపాడు | 748 | 3,209 | 1,642 | 1,567 |
| 8. | నవాబ్ పేట | 1,165 | 4,991 | 2,504 | 2,487 |
| 9. | పెనుగంచిప్రోలు | 3,202 | 13,390 | 6,739 | 6,651 |
| 10. | శనగపాడు | 917 | 3,630 | 1,823 | 1,807 |
| 11. | సుబ్బాయిగూడెం | 433 | 1,811 | 888 | 923 |
| 12. | తోటచెర్ల | 481 | 1,902 | 999 | 903 |
| 13. | వెంకటాపురం | 255 | 1,230 | 648 | 582 |
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 51,811 - పురుషుల సంఖ్య 25,782 - స్త్రీల సంఖ్య 26,029 - గృహాల సంఖ్య 14,262;
+జనాభా (2001) - మొత్తం 50,695 - పురుషులు 25,551 - స్త్రీలు 25,500
వనరులు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు25; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-27; 9వపేజీ. [4] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఫిబ్రవరి-11; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఫిబ్రవరి-19; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జూన్-4; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఆగష్టు-9; 2వపేజీ.


