పెనమలూరు

పెనమలూరు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు ఒక శాసనసభ నియోజకవర్గం. పిన్ కోడ్ నం. 521 139., ఎస్.టి.డి.కోడ్ = 0866. పెనమలూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ యొక్క పరిసర ప్రాంతం.[1]

Penamaluru
పెనమలూరు
Village
పెనమలూరు పంచాయితీ కార్యాలయము
Penamaluru
భారత దేశము, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాంతము
భౌగోళికాంశాలు: 16°28′05″N 80°43′10″E
CountryIndia
Stateఆంధ్ర ప్రదేశ్
Languages
  Officialతెలుగు
సమయప్రాంతంIST (UTC+5:30)
వాహన రిజిస్ట్రేషన్AP–16
Lok Sabha constituencyమచిలీపట్నం
పెనమలూరు
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ బాలాజీ నాయక్
జనాభా (2001)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 5,771
 - స్త్రీల సంఖ్య 5,874
 - గృహాల సంఖ్య 2,964
పిన్ కోడ్ 521139
ఎస్.టి.డి కోడ్ 0866
పెనమలూరు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనమలూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనమలూరు మండలం యొక్క స్థానము
Lua error in మాడ్యూల్:Location_map at line 418: No value was provided for longitude.
ఆంధ్రప్రదేశ్ పటములో పెనమలూరు యొక్క స్థానము
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము పెనమలూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,24,557
 - పురుషులు 63,602
 - స్త్రీలు 60,955
అక్షరాస్యత (2001)
 - మొత్తం 76.52%
 - పురుషులు 81.27%
 - స్త్రీలు 71.60%
పిన్ కోడ్ 521139

గ్రామ చరిత్ర

మెట్రోపాలిటన్ ప్రాంతం

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[2][3]

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామం పినమల్లేశ్వరుడు ద్వారా దాని పేరు వచ్చింది మరియు గతంలో మథబ్ కా పెనమలూరు అని పిలుస్తారు.[4]

గ్రామ భౌగోళికం

పెనమలూరు నియోజకవర్గంలో మండలాలు

1. పెనమలూరు 2.కంకిపాడు 3విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు మొత్తం మూడు మండలాలున్నాయి.

గ్రామ భౌగోళికం

[5] సముద్రమట్టానికి 19 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ప్రధాన గ్రామీణ రహదారులు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[6][7] వివిధ పాఠశాలలు తెలుగు మరియు ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.

  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

పశువుల ఆసుపత్రి, పెనమలూరు

ఆసుపత్రులు, వైద్యశాలలు

శ్రీ రామా హాస్పిటల్ యోగ ‍‍మరియు ప్రకృతి చికిత్సాలయం, డో.నం. 5-18/1, శ్రీ మణి నిలయం, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా, పెనమలూరు, విజయవాడ - 5211390. (డా.బాబూరావు పొట్లూరి, ఫోన్ నం.:0866 - 2581009, మొబైల్:9491130967, 9848236102

బ్యాంకులు

సిండికేటు బ్యాంకు:- ఈ గ్రామంలో సిండికేటు బ్యాంకు శాఖను, 2014,డిసెంబరు-17వ తేదీనాడు ప్రారంభించారు. ఇక్కడ ఖాతాదారులకు ఆధునిక సాంకేతిక పరిఙానంతోకూడిన సేవలను అందించెదరు. [6]

కార్యాలయాలు, ఇతర ఆఫీసులు

  • ఎమ్మర్వో కార్యాలయము, పెనమలూరు.
  • ఎమ్డీవో కార్యాలయము, పెనమలూరు.
  • పెనమలూరు వ్యవసాయ, మత్స్యశాఖ కార్యాలయాలున్నాయి.
  • పెనమలూరు చేపలకుండీల సెంటరులో మత్స పరిశోధన కేంద్రం ఉంది.
  • ఇందిరక్రాంతి పథకం కార్యాలయం, పెనమలూరు.

విందు వివాహం, సమావేశం, ఫంక్షన్ హాళ్ళు

అనిల్ ఫంక్షన్ హాల్, మురళీ నగర్, తారక రామ రోడ్ సంఖ్య 2, పెనమలూరు,

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గోగులమ్మ చెరువు.

గ్రామ పంచాయతీ

ఎం ఆర్ ఓ కార్యాలయం, పెనమలూరు

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీ బర్మావత్ బాలాజీ నాయక్ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అర్వపల్లి చంటి ఎన్నికైనారు. [2]

శ్రీ రామంజనేయ స్వామి దేవస్థానం, పెనమలూరు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.

  1. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పెనమలూరులోని ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2014,జూన్-16 నుండి 19 వరకు నిర్వహించారు. 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఆ రోజున విష్వక్సేన ఆరాధన, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, తీర్ధగోష్ఠి తదితర పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు.17వ తేదీ ఉదయం, ధ్వజారోహణ, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం,18వ తేదీన హోమపూజలు 19వ తేదీన వసంతోత్సవం నిర్వహించారు [4]&[5]
  2. శ్రీ గంగానమ్మ ఆలయం:- ఈ పురాతన ఆలయం, పెనమలూరులోని గోగులమ్మ చెరువు ప్రక్కనే ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

పాల కేంద్రం, పెనమలూరు

పరిశ్రమలు

హిందూస్థాన్‌ లివర్‌, సిప్లా ఇండియా, ఎల్‌జీ, రాన్‌బాక్సీ, బ్రూక్‌బ్రాండ్‌, గోద్రెజ్‌ కంపెనీల కార్యాలయాలు, గోదాములు ఉన్నాయి. వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

  1. ప్రముఖ రచయిత, టీవీ నటుడు పరిటాల ఓంకార్
  2. ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కూడా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.
  3. మండవ రిషిత :- పెనమలూరు గ్రామానికి చెందిన శ్రీ మండవ కోటేశ్వరరావు, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య శ్రీమతి రాజ్యలక్ష్మి గృహిణి. వీరు మధ్య తరగతి కుటుంబీకులు. ఈ దంపతుల కుమార్తె రిషిత, సంగారెడ్డిలోని ఎం.ఎన్.ఆర్.వైద్యకళాశాలలో చదివి ఎం.బి.బి.ఎస్.పూర్తిచేసింది. ఈమె విలువిద్యలో సవ్యసాచి. గురిచూసి బాణం వదిలితే లక్ష్యాన్ని ఛేదించినట్లే. విల్లు ఎక్కుపెడితే, పతకం ఆమె చేతిలో పడినట్లే. ఈమె ఇంతింతై వటుడింతైనట్లుగా పెనమలూరు నుండి అంతర్జాతీయస్థాయిలో ఆర్చరీలో విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె విలువిద్యలోనేగాక అటు ఉన్నత విద్యలోగూడా రాణించి, ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసింది. [3]

గ్రామ విశేషాలు

పెనమలూరు మండలం లోని గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[8]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.చోడవరం7823,0751,5221,553
2.గంగూరు1,4636,6433,6922,951
3.గోసాల1,1744,9832,4682,515
4.పెద్దపులిపాక6252,4421,2211,221
5.పెనమలూరు2,96411,6455,7715,874
6.పోరంకి4,31420,1559,88310,272
7.తాడిగడప3,27512,9476,5066,441
8.వణుకూరు1,6806,5523,2433,309

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఆంగ్లం). Retrieved 27 March 2017.
  2. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Retrieved 27 March 2017.
  3. https://en.wikipedia.org/wiki/Penamaluru
  4. "http://www.onefivenine.com/india/villag/Krishna/Penamaluru". Retrieved 18 June 2016. External link in |title= (help)
  5. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Retrieved 7 November 2016.
  6. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Retrieved 7 November 2016.
  7. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు, 2013 ఆగస్టు 13. 2వ పేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఫిబ్రవరి-13; 8వ పేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-16; 1వ పేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-17; 2వ పేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,డిసెంబరు-18; 2వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.