పెదయెరుకపాడు గ్రామీణ
పెదయెరుకపాడు, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామము.
| పెదయెరుకపాడు గ్రామీణ | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | గుడివాడ |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 128 |
| - పురుషుల సంఖ్య | 65 |
| - స్త్రీల సంఖ్య | 63 |
| - గృహాల సంఖ్య | 47 |
| పిన్ కోడ్ | 521301 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు
పెదయెరుకపాడు నుండి గుడివాడ పట్టణం 2 కి.మీ. దూరంలో ఉంది.
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామములో మౌలిక వసతులు
విద్యుత్తు
ఈ గ్రామములో రు. 1.8 కోట్ల వ్యయంతో, 4 ఫీడర్లుగల 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రానికి 2015, ఆగస్టు-12వ తేదీనాడు ప్రయోగాత్మక పరీక్ష (ట్రయల్ రన్) నిర్వహించారు. ఈ కేంద్రం నిర్మించుటవలన, హెడ్ వాటర్ వర్క్స్ కు 24 గంటలూ విద్యుత్తు సరఫరా లభించుటయేగాక, పరిసరప్రాంతాలయిన తట్టివర్రు, పెద యెరుకపాడు, మందపాడు గ్రామాలకు గూడా, అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్తు సరఫారా జరుగును. [1]
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో 2015, డిసెంబరు-20వ తేదీ ఆదివారంనాడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వేదపండితుల అధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో మంటపారాధన, నవగ్రహపూజలు, బాబాకు లక్ష తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. ప్రతిష్ఠ విగ్రహానికి ధాన్యధివాసం, క్షీరాధివాసం, జలధివాసం నిర్వహించారు. అనంతరం పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. [3]
- శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం మరియు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2016, ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు నిర్వహించెదరు. [5]
- శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం:- గ్రామములోని శతాబ్దాల కాలంనాటి, ఈ పురాతన ఆలయ జీర్ణోద్ధరణ పనుల కొరకు, 2016, నవంబరు-20వతేదీ ఆదివారంనాడు శంకుస్థాపన నిర్వహించారు. [6]
- శ్రీ షిర్డీ సాయి మందిరం.
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గ్రామ విశేషాలు
ఈ గ్రామానికి చెందిన శ్రీమతి బేతపూడి సుధాంశకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డాక్టరేట్ పట్టా ప్రదానం చేసారు. రసాయనశాస్త్రంలో, Studies of molicular inter actions in bainary mixtures combining benzine derivetives అను అంశంపై ఈమె సమర్పించిన పరిశోధనా వ్యాసానికి ఈమెకు డాక్టరేట్ లభించింది. [4]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 128 - పురుషుల సంఖ్య 65 - స్త్రీల సంఖ్య 63 - గృహాల సంఖ్య 47
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 199.[1] ఇందులో పురుషుల సంఖ్య 104, స్త్రీల సంఖ్య 95, గ్రామంలో నివాస గృహాలు 56 ఉన్నాయి.
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-13; 27వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-21; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016, జనవరి-28; 27వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-28; 2వపేజీ. [6] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, నవంబరు-21; 1వపేజీ.