పెదపారుపూడి మండలం
పెదపారుపూడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము.[1]
| పెదపారుపూడి | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() పెదపారుపూడి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.4260°N 80.9548°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పెదపారుపూడి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 2,835 |
| - పురుషులు | 1,435 |
| - స్త్రీలు | 1,413 |
| - గృహాల సంఖ్య | 737 |
| పిన్ కోడ్ | 521263 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
| పెదపారుపూడి | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో పెదపారుపూడి మండలం యొక్క స్థానము |
|
![]() పెదపారుపూడి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.4260°N 80.9548°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | పెదపారుపూడి |
| గ్రామాలు | 18 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 33,099 |
| - పురుషులు | 16,531 |
| - స్త్రీలు | 16,568 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 74.34% |
| - పురుషులు | 77.70% |
| - స్త్రీలు | 71.00% |
| పిన్ కోడ్ | 521263 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భొగోళికం
[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
ఈ ఊరు గుడివాడ నుండి 5 కి.మీ. దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యం
వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వే స్టేషన్: 40 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
గీతాంజలి జూనియర్ కాలేజి, జిల్లాపరిషత్ హైస్కూల్, ఎస్.నవజీవన్ ఉన్నత పాఠశాల, పెదపారుపూడి.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
ప్లాస్టిక్ వ్యర్ధాల కొనుగోలు కేంద్రం
ఈ గ్రామములో 2017,జులై-6న ఈ కొనుగోలు కేంద్రాన్ని, ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను కిలో 20 రూపాయల చొప్పున కొనుగోలు చేసెదరు. [9]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
ఈ గ్రామ పంచాయతీ నవంబరు-5,1951 నాడు ఆవిర్భవించింది. [4]
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గారపాటి లక్ష్మి, సర్పంచ్‌గా ఎన్నికైనారు. [10]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
శ్రీ ఆంజనేయస్వామివారి మందిరం
- ఈ ఆలయంలో 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారం నాడు, పంచలోహ విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ఠాపన ఉత్సవం, శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 కలశాలతో, పంచమృతాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ విగ్రహ తయారీకి అయిన 2.4 లక్షల రూపాయల వ్యయాన్ని, గ్రామస్తులంతా సమష్టిగా విరాళంగా అందజేసినారు. [4]
- ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-13వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే విఘ్నేశ్వరపూజ, ఆకుపూజ, నాగావళి అర్చన, విశేష పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. [6]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
ఈ గ్రామం వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయంలో నూతన వరవడి రూపొందించిన వరి కోత మిషను వర్కు షాపు ఉంది.
ప్రముఖులు
- చెరుకూరి రామోజీరావు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు.ఈనాడు పత్రిక సంపాదకులు . వీరు ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై దత్తత తెసికొన్నారు.[3]
గ్రామ విశేషాలు
- మతే బాలశౌరి రావు ఈ ఊరిలో పనిచేసిన ప్రముఖ విద్యావేత్త. ఈయన విద్యాశాఖలో వివిధ స్థాయిలలో 36 సంవత్సరముల పాటు పనిచేశారు.
- ఈ మండలములో సుమారుగా 7 సంవత్సరములు వ్యవసాయాధికారిగా పనిచేసిన సూరపనేని శ్యామల మంచి పేరు తెచ్చుకున్నారు.
- ఘనవ్యర్ధాల నిర్వహణ కేంద్రం:- చెత్త,ఘనవ్యర్ధాల నుండి, సంపద తయారుచేసే విధంగా వినూత్న ఘనవ్యర్ధాల కేంద్రంలో, 2016,ఫిబ్రవరి-17వ తేదీనాడు, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి, వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేసే విధానానికి, వానపాములు వేసి శ్రీకారం చుట్టినారు. ఈ కేంద్రం వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేయడంతో అభివృద్ధిలో మొదటి అడుగు వేసింది. ఈ కేంద్రంలో సేంద్రియ ఎరువు విక్రయానికి 2016,ఏప్రిల్-7వ తేదీనాడు శ్రీకారం చుట్టినారు. ఈ విధంగా చెత్త నుండి సంపద తయారుచేఉకొనడం ద్వారా, పంచాయతీ ఆదాయం గణనీయంగా పెంచుకొనవచ్చునని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [7]&[8]
గ్రామాలు
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[4]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అప్పికట్ల | 262 | 1,042 | 521 | 521 |
| 2. | భూషనగుల్ల (Rural) | 552 | 2,050 | 1,018 | 1,032 |
| 3. | చినపారుపూడి | 359 | 1,363 | 691 | 672 |
| 4. | ఏదులమద్దాలి | 358 | 1,261 | 632 | 629 |
| 5. | ఎలమర్రు | 1,227 | 4,433 | 2,266 | 2,167 |
| 6. | గురువిందగుంట | 176 | 686 | 344 | 342 |
| 7. | జువ్వనపూడి | 147 | 573 | 289 | 284 |
| 8. | కొర్నిపాడు | 213 | 900 | 448 | 452 |
| 9. | మహేశ్వరం | 121 | 447 | 219 | 228 |
| 10. | మోపర్రు | 466 | 1,709 | 861 | 848 |
| 11. | పాములపాడు | 1,174 | 4,536 | 2,252 | 2,284 |
| 12. | పెదపారుపూడి | 737 | 2,848 | 1,435 | 1,413 |
| 13. | రావులపాడు | 135 | 451 | 221 | 230 |
| 14. | సోమవరప్పాడు | 92 | 308 | 164 | 144 |
| 15. | వానపాముల | 458 | 1,738 | 837 | 901 |
| 16. | వెంట్రప్రగడ | 1,876 | 7,038 | 3,463 | 3,575 |
| 17. | వింజరంపాడు | 303 | 1,174 | 599 | 575 |
| 18. | జమిదింటకుర్రు | 148 | 542 | 271 | 271 |
వనరులు
- "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Pedaparupudi". Retrieved 30 June 2016. External link in
|title=(help) - ఈనాడు కృష్ణా; 2015,మే నెల,3వతేదీ; 9వపేజీ.
- 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
వెలుపలి లింకులు
[4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-5; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-18; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఏప్రిల్-8; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 2వపేజీ.

