పెదగంజాం

పెదగంజాం, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 186., ఎస్.టి.డి.కోడ్ = 08592.

పెదగంజాం
  రెవిన్యూ గ్రామం  
పెదగంజాం
అక్షాంశరేఖాంశాలు: 15.642810°N 80.232425°E / 15.642810; 80.232425
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చినగంజాము
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,972
 - పురుషుల సంఖ్య 4,056
 - స్త్రీల సంఖ్య 3,916
 - గృహాల సంఖ్య 2,198
పిన్ కోడ్ 523186
ఎస్.టి.డి కోడ్ 08592

గ్రామ చరిత్ర

ఇది పురాతన కాలంలో ఒక బౌద్ధ భిక్షువుల ప్రధాన నివాసం. 1871లో అప్పటి జిల్లా కలెక్టర్ బాస్ వెల్ ఇక్కడ బౌద్ధస్థూపాలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత వచ్చిన ఆంగ్లేయ అధికారి అలెగ్జాండర్ రియల్, ఇక్కడ ఉన్న పాటిదిబ్బలపై 1888 లో త్రవ్వకాలు జరపడంతో, ఇక్కడ హీనాయాన బొద్ధమతానికి చెందిన అనేక స్థూపాల ఆనవాళ్ళు, శిల్పాలు దొరికినవి. క్రీ.శ.రెండవ శతాబ్దంలో యఙశ్రీ శాతకర్ణి వేయించిన సంస్కృత శాసనాలు గూడా ఇక్కడ లభ్యమైనవి. [5]

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ గ్రామాన్ని ఒకప్పుడు గంగాపురం, గంధపురం అని పిలిచేవారు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

చినగంజాం 5.2 కి.మీ, కనపర్తి 6.8 కి.మీ, తిమ్మసముద్రం 7.2 కి.మీ, రాపర్ల 7.9 కి.మీ, కడవకుదురు 8.9 కి.మీ.

సమీప పట్టణాలు

ఒంగోలు 40కి.మీ., చినగంజాం 5.2 కి.మీ, నాగులుప్పలపాడు 14.4 కి.మీ, వేటపాలెం 16.8 కి.మీ, ఇంకొల్లు 21.4 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

రైల్ మార్గము మరియు బస్ మార్గము.

గ్రామములోని విద్యాసౌకర్యాలు

పల్లెపాలెంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కె.కాటాక్షమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ భావ నారాయణ స్వామి దేవాలయం

పెదగంజాంలో ప్రసిద్ధమయినది భావ నారాయణ స్వామి దేవాలయం. ఈ ఆలయ ముఖ మండపం వద్దనున్న శాసనం ఆధారంగా ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలియుచున్నది. అనంతరం శ్రీకృష్ణదేవరాయల కాలంలో అభివృద్ధి జరిగింది. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ. మరియు బస్ స్టాండ్ నుండి 6 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ దేవాలయంలో, 2014, మార్చి-8 శనివారం నాడు, స్వామివారి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకినవి. సూర్యోదయం సమయంలో, స్వామివారి పాదాల నుండి మోకాళ్ళవరకూ తాకినవి. ఈ కమనీయ సన్నివేశాన్ని తిలకించి భక్తులు పరవశించారు. ముఖమంటపానికి సుమారు 100 అడుగుల దూరంలో ఉండే స్వామిని, సూర్యకిరణాలు నేరుగా తాకటం, ఒక గొప్ప అద్భుతమని గ్రామస్థులు తెలిపారు. ఆలయ నిర్మాణం, వాస్తు, ఖగోళ, శిల్పశాస్త్రాల శైలి ఆధారంగా, ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబరు నెలలలో, మొదటి రెండు వారాలలో, రెండు సార్లుగా ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలలో ఈ విధంగా జరుగుచున్నది. పెదగంజాం సమీప గ్రామ, పట్టణాల భక్తులే గాకుండా, వివిధ ప్రాంతాల భక్తులు ముందుగానే వచ్చి, వేకువఝాము నుండి వేచియుండి, ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి తరించారు. మబ్బులు పట్టకుండా ఉంటే, మరో 5 రోజులు సూర్యకిరణాలు స్వామిని తాకుతాయని వేద పండితులు చెబుతున్నారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

పెదగంజాం గ్రామంలోని ముఖ్యమైన పంటలు వరి, వేరుశనగ, జీడి మామిడి, పుచ్చకాయలు, ఉప్పు లాంటి పంటలు మాపెదగంజాం గ్రామంలో పండుతాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

పెదగంజాం గ్రామంలో ఎక్కువుగా వ్యవసాయ కూలీలు ఉన్నారు అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 7,972 - పురుషుల సంఖ్య 4,056 - స్త్రీల సంఖ్య 3,916 - గృహాల సంఖ్య 2,198

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,433.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,778, మహిళల సంఖ్య 3,655, గ్రామంలో నివాస గృహాలు 1,783 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 945 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

మూలాలు

వెలుపలి లంకెలు

[3] ఈనాడు ప్రకాశం; 2014, మార్చి-9; 8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-20; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.