పూసపాటి అశోక్ గజపతి రాజు

పూసపాటి అశోక్ గజపతి రాజు (జననం 1951 జూన్ 16) రాజకీయ నేత. ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

పూసపాటి అశోక్ గజపతి రాజు


లోక్‍సభ సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రి
పదవీ కాలము
2014 - ప్రస్తుత
ముందు బొత్స ఝాన్సీ లక్ష్మి
నియోజకవర్గము విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలము
1978-1983 1983-1985
1985-1989 1989-1994
1994-1999 1999-2004
2009-2014
నియోజకవర్గం విజయనగరం శాసనసభా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1951-06-16) 1951 జూన్ 16
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
జీవిత భాగస్వామి సునీత
సంతానము ఇద్దరు
పూర్వ విద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
మతం హిందువు

రాజకీయ ప్రస్థానం

తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసారు.[1] 2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎం.పీగా ఎన్నుకోబడ్డారు.[2] నరేంద్ర మోడి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబునాయుడు హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేసారు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు.

వ్యక్తిగత జీవితం

పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే. వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" (1924 మే 1-1995 నవంబరు 14). ఆయన భారత పార్లమెంట్ సభ్యులు.[3]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.