పూర్వ ఫల్గుణి నక్షత్రము

పూర్వఫలుగుణి నక్షత్రము గుణగణాలు

పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు వీరికి బాల్యములో కొంత వరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. లౌక్యము, అధికారము కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలముగా ప్రవర్తించె కారణముగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యొగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి మందుకు పోలేరు. సౌమ్యులే అయినా గమ్భిరత కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఎమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానము చేస్తారు. సివిలు కెసులను ఎదుర్కొంటారు. స్వయంకృతాపరాధము వలన తాను శ్రమిమ్చి సాధిమ్చిన దానిని వైరి వర్గానికి ధారపొస్తారు. స్నెహితుల ఉచ్చు నుండి కోమ్దరు జీవితకాలము వరకు బయట పడలేరు. బయట కనిపించె జీవితము కాక రహస్య జీవితము వెరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సమ్తానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేస విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మమ్చి పరిచయాలు ఉంటాయి. వీరి జీవితము స్నేహానికి అంకితము. వీరవిద్యలలో రాణిస్తారు.

పూర్వఫల్గుణీ నక్షత్ర వివరాలు

నక్షత్రములలో ఇది పదకొండవది. దీనికి పుబ్బ అని ఇంకొక పేరుంది.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
పూర్వ ఫల్గుణిశుక్రుడుమానవపురుషసింహంమోదుగమధ్యపెద్దపక్షిభర్గుడుసింహం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

పూర్వఫల్గుణి నక్షత్రజాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢశరీరశ్రమ
సంపత్తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢధన లాభం
విపత్తారరోహిణి, హస్త, శ్రవణంకార్యహాని
సంపత్తారమృగశిర, చిత్త, ధనిష్టక్షేమం
ప్రత్యక్ తారఆర్ద్ర, స్వాతి, శతభిషప్రయత్న భంగం
సాధన తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రకార్య సిద్ధి, శుభం
నైత్య తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రబంధనం
మిత్ర తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిసుఖం
అతిమిత్ర తారఅశ్విని, మఖ, మూలసుఖం, లాభం

పూర్వ ఫల్గుణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - సింహరాశి.
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

సామెతలు

పుబ్బ మాసం గురించి తెలుగు ప్రజలలో కొన్ని సామెతలు ప్రచారంలో నున్నవి.[1]

  • 1. పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బచ్చి చెట్తుక్రింది నానదు
  • 2. పుబ్బ కేరళితే భూతం కేరళినట్లు
  • 3. పుబ్బ రేగినా బూతు రేగినా నిలువదు
  • 4. పుబ్బలో చల్లేదానికంటె దిబ్బలో చల్లేది మేలు
  • 5. పుబ్బలో పుట్టెడు చల్లేకంటే దిబ్బలో మఖలో మానెడు చల్లితే మేలు
  • 6. పుబ్బలో పుట్టెడు చల్లేకంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లేది మేలు
  • 7. పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయింది

చిత్ర మాలిక

మూలాలు

  1. కృష్ణమూర్తి, పి. (1955). లోకోక్తి ముక్తావళి. తెనాలి: ది మోడరన్ పబ్లికేషన్స్. p. 125. Retrieved 13 June 2016.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.