పూర్వాభాద్ర నక్షత్రము

పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు

పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చేస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

నక్షత్ర వివరాలు

నక్షత్రములలో ఇది25వ నక్షత్రము.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
పూర్వాభద్రగురువుమానవపురుషజంతువుమామిడిఆదిఅజైక పాదుడు1,2,3, కుంభం,4 మీనం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము
నక్షత్రం/వివరం ప్రత్యేక వివరం
నక్షత్ర అధిపతి
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షం
రాశి
అధిదేవత
నాడి

పూర్వాబాధ్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రశరీరశ్రమ
సంపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రధన లాభం
విపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతికార్యహాని
సంపత్తారఅశ్విని, మఖ, మూలక్షేమం
ప్రత్యక్ తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢప్రయత్న భంగం
సాధన తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢకార్య సిద్ధి, శుభం
నైత్య తారరోహిణి, హస్త, శ్రవణంబంధనం
మిత్ర తారమృగశిర, చిత్త, ధనిష్టసుఖం
అతిమిత్ర తారఆరుద్ర, స్వాతి, శతభిషసుఖం, లాభం

పూర్వాభద్రా నక్షత్రము నవాంశ

  • 1వ పాదము - మేషరాశి.
  • 2వ పాదము - వృషభరాశి.
  • 3వ పాదము - మిధునరాశి.
  • 4వ పాదము - కర్కాటకరాశి.

చిత్రమాలిక

ఇతర వివరాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.