పూనూరు
పూనూరు, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 169., ఎస్.టి.డి.కోడ్ = 08594.[1]
| పూనూరు | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() పూనూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.937322°N 80.169371°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | యద్దనపూడి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ బోయపాటి సాంబశివరావు |
| జనాభా (2011) | |
| - మొత్తం | 6,047 |
| - పురుషుల సంఖ్య | 2,918 |
| - స్త్రీల సంఖ్య | 3,129 |
| - గృహాల సంఖ్య | 1,735 |
| పిన్ కోడ్ | 523169 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
గన్నవరం 4 కి.మీ, ఇడుపులపాడు 4 కి.మీ, తనుబొద్దివారిపాలెం 4 కి.మీ, చిమటావారిపాలెం 4 కి.మీ, ద్రోణాదుల 5 కి.మీ.
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
- గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణము నుండి మండలములోని ముఖ్య గ్రామాలైన అనంతవరము, యనమదల, యద్దనపూడి, గన్నవరం లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు ఉంది.
- గుంటూరు నుండి పర్చూరు, నూతలపాడు, చింతగుంటపాలెంలను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న భవనం లక్ష్మీకావ్య అను విద్యాధిని, ఇటీవల అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2016, మార్చిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో, రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుంది. [5]
- మూడు ప్రాథమిక పాఠశాలలు.
గ్రామంలో మౌలిక వసతులు
- ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి.
- గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామకృష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
నాగార్జున సాగర్ కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి.
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
గ్రామంలో ప్రధాన పంటలు
మెట్టపొలాలలో మినుము, శనగ, మొక్కజొన్న, మిరప, జూటు, ప్రత్తి ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
ఈ గ్రామములో శ్రీమతి మెట్ల అచ్చమ్మ అను ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 101 సంవత్సరాల వయస్సులో, 2015, డిసెంబరు-12వ తేదీనాడు ఆకస్మాత్తుగ్గా కాలధర్మం చెందినారు. [4]
గణాంకాలు
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,038.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,976, మహిళల సంఖ్య 3,062, గ్రామంలో నివాస గృహాలు 1,564 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,996 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 6,047 - పురుషుల సంఖ్య 2,918 -స్త్రీల సంఖ్య 3,129 - గృహాల సంఖ్య 1,735
మూలాలు
వెలుపలి లింకులు
[3] ఈనాడు ప్రకాశం/పర్చూరు; 2013, ఆగస్టు-8; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-13; 3వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2016, ఫిబ్రవరి-4; 2వపేజీ.
