పూనమ్ బజ్వా

పూనమ్ బజ్వా భారతీయ సినిమా నటి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది.[1]

పూనమ్ బజ్వా
పూనమ్ బజ్వా
జననంపూనమ్ అమర్జిత్ సింగ్ బజ్వా
ఏప్రిల్ 05
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2005–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల, 10 అంగుళాలు
తల్లిదండ్రులుఅమర్జిత్ సింగ్, దీపికా సింగ్

జననం

పూనమ్ ముంబై లోని పంజాబీ కుంటుబంలో 1985, ఏప్రిల్ 05 న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. చెల్లెలు పేరు దయా. 2005 లో మిస్ పూణేగా గెలిచింది. పై చదువులు చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ కి వచ్చినపుడు, మొదటి సినిమా దర్శకుడు చూసి తన సినిమాలో నటించాలని కోరారు. 12వ తరగతి చదివిన పూనమ్, తన కాలేజి చదువుకు ఐదు నెలల విరామం ఉండడంతో, చిత్రంలో నటించటానికి అంగీకరించింది. పూణేలోని SIMC నుండి సాహిత్యంలో డిగ్రీ అందుకుంది.

సినీ ప్రస్థానం

2005లో వచ్చిన మొదటి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన పూనమ్, అక్కినేని నాగార్జునతో బాస్, భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది.

2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది.

కొత్త దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వంలో నటించింది. మమ్ముట్టి మరియు మోహన్ లాల్తో కలిసి నటించింది. రఫీ మెకార్టీన్ దర్శకత్వంలో వచ్చిన చైనా టౌన్ అనే మలయాళ సినిమాలో ఎమిలీ పాత్రలో మోహన్ లాల్, దిలీప్, జయరాం, సూరజ్ వెంజారామూడ్, మరియు కావ్య మాధవన్ లతో నటించింది.

'ఓం' సినిమాను తెర‌కెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి.[2]

చిత్ర సమహారం

సంవత్సరంసినిమా పేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2005మొదటి సినిమాసింధుతెలుగు
2006ప్రేమంటే ఇంతేపావనితెలుగు
బాస్శృతి రాంప్రకాశ్తెలుగు
తంగిగాగిప్రియకన్నడ
2007వేడుకహరిణితెలుగు
2008పరుగుసుబ్బలక్ష్మీ నీలకంఠతెలుగు
పెవల్పారిజాతం పంచమితమిళం
తేనేవట్టుగాయత్రితమిళం
2010కచేరి ఆరంభంమదితమిళం
ద్రోహిశృతి, లోచనితమిళం
2011తంబికొట్టయికనగ అమృతలింగంతమిళం
చైన టౌన్ఎమిలిమలయాళం
వెనిసిల్ వ్యాపారిలక్ష్మీమలయాళం
2012శికారిరేణుక, నందితమలయాళం
కన్నడ
మంత్రికన్నందినిమలయాళం
2014పెరుచాజిపూనమ్ బాజ్వామలయాళంఅతిథి పాత్ర
2015ఆంబాలపూనమ్ బాజ్వాతమిళంఅతిథి పాత్ర
రోమియో జూలియట్నిషాతమిళం
2016మస్త్ మొహబాత్మాయకన్నడ
ఆరన్మణి 2మంజుతమిళం
కళావతి 2[3]మంజుతెలుగు
ముతిన కతిరికైమాయతమిళం
జాచరియా పోతెన్ జీవిచిరిప్పుండ్మలయాళంఆలస్యం
రోసాపూక్కలమ్మలయాళంఆలస్యం
భోగితమిళంచిత్రీకరణ

మూలాలు

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "పూనమ్ బాజ్వా,PoonamBajwa". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.
  2. టి.ఎస్. న్యూస్. "పూనమ్ బాజ్వా పెళ్లి అయ్యిందా?". www.tsnews.tv. Retrieved 2 October 2016.
  3. సాక్షి, సినిమా. "'కళావతి' న్యూ స్టిల్స్". Retrieved 2 October 2016.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.