పుష్యమి నక్షత్రము

  • నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం.
నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
పుష్యమిశనిదేవస్త్రీమేకపిప్పిలిమధ్యనీరుకాకిభృహస్పతికటకం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

Disambiguation

పుష్యమి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రశరీరశ్రమ
సంపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిధన లాభం
విపత్తారఅశ్విని, మఖ, మూలకార్యహాని
సంపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢక్షేమం
ప్రత్యక్ తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢప్రయత్న భంగం
సాధన తారరోహిణి, హస్త, శ్రవణంకార్య సిద్ధి, శుభం
నైత్య తారమృగశిర, చిత్త, ధనిష్టబంధనం
మిత్ర తారఆరుద్ర, స్వాతి, శతభిషసుఖం
అతిమిత్ర తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రసుఖం, లాభం

పుష్యమి నక్షత్రము

  • 1 వ పాదము - సింహరాశి.
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

పుష్యమి నక్షత్రము గుణగణలు

పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడుపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనమ్ వచ్చిన తరువాత జీవితము అడృష్టాఆనికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్ఠంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాతముగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మమ్చి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాదాల వలన సమాజంలో అప్రతిష్ఠకు లోనౌతారు. వారి సలహాల వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. నైతిక విలువలు లేని వైరి వర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రమ్గములో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.