పుల్లరిపాలెం

పుల్లరిపాలెం, ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన గ్రామము.[1]

  • పుల్లరిపాలెం పంచాయతీ 1955లో ఏర్పాటయినది. 1981లో, కొత్తరెడ్డిపాలెం గ్రామంలో పంచాయతీ ఆఫీసు నిర్మించారు. ఈ పంచాయతీ క్రింద, బచ్చులవారిపాలెం, ఊటుకూరు సుబ్బయ్య పాలెం, రామచంద్రాపురం, కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, సాయినగర్ గ్రామాలున్నవి. రెవెన్యూ గ్రామం గూడా అయిన ఈ గ్రామంలో, రికార్డుల ప్రకారం 3,200 ఎకరాల భూములున్నవి. పంచాయతీలో అంతర్భాగమైన కొత్త రెడ్డిపాలెం, పాత రెడ్డిపాలెం గ్రామాల మధ్యన అటవీ భూములున్నవి. ఆ రోజులలో అటవీ శాఖాధికారులు ఈ భూములలో "పుల్లరి" పేరుతో సుంకం వసూలు చేసేవారు. అందుకే ఆపేరు వచ్చింది. [1]
పుల్లరిపాలెం
  రెవిన్యూ గ్రామం  
పుల్లరిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15.741928°N 80.310168°E / 15.741928; 80.310168
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం వేటపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,791
 - పురుషుల సంఖ్య 1,372
 - స్త్రీల సంఖ్య 1,419
 - గృహాల సంఖ్య 800
పిన్ కోడ్ 523187
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,791 - పురుషుల సంఖ్య 1,372 - స్త్రీల సంఖ్య 1,419 - గృహాల సంఖ్య 800

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,266.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,134, మహిళల సంఖ్య 1,132, గ్రామంలో నివాస గృహాలు 582 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,348 హెక్టారులు.

సమీప గ్రామాలు

కడవకుదురు 6 కి.మీ, సంతరావూరు 7 కి.మీ, వేటపాలెం 7 కి.మీ, చినగంజాం 8 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన చినగంజాం మండలం, ఉత్తరాన చీరాల మండలం, పశ్చిమాన ఇంకొల్లు మండలం, ఉత్తరాన కారంచేడు మండలం.

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.