పులివెందుల
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం.[1]
| పులివెందుల | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
| మండలం | పులివెందల |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516390 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ నామ చరిత్ర
పులివెందుల పేరు పులిమందల అన్న పదం నుంచి వచ్చిందని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో పులుల మందలు ఎక్కువగా ఉండేవనీ, కాబట్టి పులిమందల అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్పే వ్యుత్పత్తి. అదే కాలక్రమేణా పులివెందుల అయిందంటారు.[2]
భౌగోళికాంశాలు
పులివెందుల 14.4167°N 78.2333°E వద్ద ఉంది.[3] సముద్ర మట్టానికి 272 మీటర్ల ఎత్తులో గలదు (895 అడుగులు).
చరిత్ర
పూర్వం ఇక్కడ వారు ఆరు మాసాల పాటు తపమాచరించారని, ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. ఇక్కడ రాజ రెడ్డి కళాశాల స్థాపించబడిఉన్న కొండ పై ఒకప్పుడు కోట ఉండేది, కళాశాల భవనం కోసం తవ్వకాలు జరిపినప్పుడు రుద్రమదేవి విగ్రహం ఒకటి బయట పడింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన తొలి శాసనం (1509) పులివెందుల పట్టణానికి సమీపంలోని శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో ఉంది. రాజకీయంగా ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది.
వ్యవసాయం
ఇక్కడ ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, బత్తాయి, అరటి, వేరు శెనగ సాగు చేస్తారు. చిత్రావతి నది పై పార్నపల్లె వద్ద గల ఆనకట్ట ద్వారా తాగు నీరు ఇంకా సాగు నీరు అందుతాయి.
ప్రముఖులు
- పులివెందుల నబీసాయిబు వరసిద్ధి వినాయక చెక్క భజన సంఘం స్థాపకుడు
- వై.యస్. రాజశేఖరరెడ్డి
విద్య
చుట్టు పక్కల గ్రామాలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇది ఒక విద్యా కేంద్రంగా వ్యవహరిస్తుంది. ప్రఖ్యాత జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల 2006 లో Dr.వై. ఎస్. రాజశఖరరెడ్డి గారిచే ఇక్కడ స్థాపించబడింది.
- AP IIIT R.K. VALLEY (RGUKT) (IDUPULAPAYA)
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. pp. 62, 63. Retrieved 2 July 2018.
- Falling Rain Genomics.Pulivendla
