పునర్వసు నక్షత్రము

నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం. శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రం.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
పునర్వసుగురువుదేవవపురుషపులివెదురుఆదిహంసఅధితికటకం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

Disambiguation

పునర్వసు నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రశరీరశ్రమ
సంపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రధన లాభం
విపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతికార్యహాని
సంపత్తారఅశ్విని, మఖ, మూలక్షేమం
ప్రత్యక్ తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢప్రయత్న భంగం
సాధన తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢకార్య సిద్ధి, శుభం
నైత్య తారరోహిణి, హస్త, శ్రవణంబంధనం
మిత్ర తారమృగశిర, చిత్త, ధనిష్టసుఖం
అతిమిత్ర తారఆరుద్ర, స్వాతి, శతభిషసుఖం, లాభం

పునర్వసు నక్షత్రము నవాంశ

  • 1 2 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటక రాశి.

పునర్వసు నక్షత్రము గుణాగణాలు

ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసత కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మతలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపదతఅరు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాసము ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరిమ్చగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయత పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.