పుత్తూరు

పుత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.[1].

చరిత్ర

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. ఆయన వ్రాసుకున్నదాని ప్రకారం 1830ల నాటికే పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి (స్వయంపాకం వంటిది) ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం (ముసాఫరుఖానా) కట్టించారు. చిన్న పట్టణం (చిన్న పేటస్థలం) అని వివరించారు. కావలసిన వస్తువులు దొరుకుతాయన్నారు[2].

వైద్య సదుపాయాలు

ఈ గ్రామములో ఎముకలు విరిగినవారికి సంప్రదాయబద్దంగా చికిత్స చేస్తారు.

వెలుపలి లంకెలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.