పి.సుశీల
పి.సుశీల (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ మరియు సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.
| పి.సుశీల | |
|---|---|
![]() | |
| వ్యక్తిగత సమాచారం | |
| ఇతర పేర్లు | గాన సరస్వతి, కన్నడ కోగిలె |
| జననం | 1935 నవంబరు 13 |
| మూలం | విజయనగరం, మద్రాస్ ప్రెసిడెన్సి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారత దేశము |
| రంగం | Playback singing, Carnatic music |
| వృత్తి | గాయని |
| వాయిద్యాలు | Vocalist |
| క్రియాశీల కాలం | 1952–ప్రస్తుతం వరకు |
| వెబ్‌సైటు | psusheela.org |
సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది.
పురస్కారములు
- భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు) ఎన్నుకోబడింది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో
- కర్ణాటక మహాజనతె - 'గాన సరస్వతీ' బిరుదు (2004)
- స్వరాలయ ఏసుదాస్ పురస్కారం 2005 లో
- 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గాన కోకిల పి.సుశీలని సత్కరించింది.
పాడిన సినిమాలు
మూలాలు
బయటి లింకులు
| Wikimedia Commons has media related to P. Susheela. |
| భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు |
|---|
| భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్ |
| ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి |
| ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే |
| ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని |
| ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం |
| ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా |
| ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా |
| ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా |
| ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా |
| ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా |
| జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు |
| ఉత్తమ ద్వితీయ సినిమా |
| ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం |
| ఇందిరా గాంధీ పురస్కారం |
| నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం |
| నర్గీస్ దత్ పురస్కారం |
| జీవితకాల గుర్తింపు పురస్కారం |
| దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము |
| ఉత్తమ సినిమా పుస్తకం |
| ఉత్తమ సినిమా పుస్తకం |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

