పాలకొల్లు
పాలకొల్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 534260. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.
పేరువెనుక చరిత్ర
పాలకొల్లుకు దుగ్ధోపవనపురం, ఉపమన్యుపురం అనేవి నామాంతరాలు. మహాభక్తుడైన ఉపమన్యుడు ఈ ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యుపురమనీ, పాలకొలను అనీ పేర్లు వచ్చాయంటారు. పాలకొలను అనే పేరు జనవ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సంస్కృతీకరణగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా ఉంది.[1]
చరిత్ర
వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక క్రీ.శ.1157లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి క్రీ.శ.1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని క్రీ.శ.1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. క్రీ.శ.1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.
పంచారామక్షేత్రం



ఆంధ్ర ప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్ర ప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
ఇతర దేవాలయములు
- పాలకొల్లులో చిన్న గోపురం అని పిలువబడే మరొక ఆలయము ఉంది.ఇక్కడి మూలవిరాట్ కేశవస్వామివారు
- అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం ఊళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.
- ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము ఉంది. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
- పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు. పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును.
- పాలకొల్లు గ్రామ దేవత దేసాలమ్మ వారు.
- కాలువ మార్గములో షిర్డిసాయినాథుని మందిరము నాలుగెకరాల విస్తీర్ణములో ఉంది. ఆలయము వెనుక భోజనశాల, ధ్యాన మందిరము, ఉద్యాన వనములు ఉన్నాయి. గురువారము రోజున వేలమంది స్వామిని దర్శించేందుకు తరలి వస్తుంటారు. ప్రతి రోజూ ఉచిత భోజన కార్యక్రము జరుగును.
- అయ్యప్పస్వామి వారి ఆలయము. సాయినాథుని దేవాలయమునకు ఎదురుగా కాలవ ఇవతలి వైపు నర్సాపురం వెళ్ళే రోడ్డులో రెండు అంతస్తులుగా అద్భుత నిర్మాణముగా మలచారు.
మరికొన్ని విశేషాలు
- లలితకళాంజలి కళాక్షేత్రం.
విద్యుదాధారిత వినోద సాధనాలు పెరుగుతుండటంతో నాటకాలకు తరిగి పోతున్న ఆదరణ ఎరిగినదే. అటువంటి కళా సంరక్షణార్ధం ఏర్పాటైన కొద్ది సంస్థలలో లలిత కళాంజలి కళా క్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి ఉత్తమ నాటకాలకు, ఉత్తమ నటీ నటులకు పురస్కారములతో సత్కరించటం జరుగుతున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ప్రసిద్దులైన ఎందరో నటీ నటులు సినిమాలకు పరిచయమయ్యారు, అవుతున్నారు.
- లయన్స్ క్లబ్ మరియు సంగీతకాడమీ.
పాలకొల్లు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో ప్రజోపకార కార్యక్రమములు జరుగుతున్నవి. ఉచిత నేత్ర శస్త్ర చికిత్సా శిబిరాలు, వికలాంగులగు ఆర్థిక సహాయములు, ఆధారములేని స్త్రీలకు కుట్టు మిషన్లు పంపిణీ ఇలా పలు కార్యక్రమములు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారు. సంగీతాసక్తి ఉన్న వారికి మంచి ఉపాద్యాయులద్వారా శిక్షణ తరగతులు, పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటరు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు.
- బాలకేంద్రం (మహిళామండలి)
బాలలకు కళా రూపాలైన భరతనాట్యం, చిత్రలేఖనం, సంగీతం లాంటివాటిలో శిక్షణ ఇస్తుంటారు. 1980 అక్టోబరు రెండున ప్రారంబించిన ఈ బాలకేంద్రం దివంగత బొండాడ వెంకట్రామగుప్త కృసి ఫలితంగా పాలకొల్లుకు కేటాయించారు. మహిళా మడలి భవనంలో కొంతభాగమును దీనికి కేతాయించారు. ఇక్కడ నామమాత్రపు రుసుము 50 రూపాయలతో వివిధ విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. కేవలం కళలోనే కాక వృత్తి విద్యా కోర్సులైన టైలరింగ్, అద్దకం వంటి వాట్ని కూడా నేర్పుతున్నారు.
ఇక్కడ శిక్షణ ఇచ్చు కోర్సులు. వీణ, గాత్రం, వేణువు, భరతనాట్యం, కూచిపూడి, చిత్రలేఖనం, - టైలరింగ్, అద్దకం, ఎంబ్రాయడరీ మొదలగునవి.
పాలకొల్లు బత్తాయిలకు బహు ప్రసిద్దం. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గినప్పటికిన్నీ పేరు మాత్రం మారలేదు. సినిమాలలో సైతం పాలకొల్లు బత్తాయి పేరు అత్యధికంగా వినిపిస్తుంది.మూస:ఆధారం కోరబడింది
- నవారు లేదా నవ్వారు.
మంచాలకు ఉపయోగించు నవ్వారు తయారు ఇక్కడ అధికం. నవ్వారు నేయు యంత్రములు షావుకారు పేట అను ప్రాంతమందు అధికం. ఈ ప్రాంతమునుండి ఇతర ప్రాంతములకు ఎగుమతి జరుగును.
- లేసు పరిశ్రమ.
పాలకొల్లులో లేసు పరిశ్రమ ద్వారా ఇతర దేశాలకు సైతం ఎగుమతి జరుగును. పాలకొల్లు కేంద్రంగా కొమ్ముచిక్కాలలో దాదాపు రెండువేలమంది పనిచేయు లేసు పరిశ్రమ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన 'పీతాని సత్యనారాయణ' తండ్రి పేరున స్థాపించిన 'పేతాని వెంకన్న'లేసు పరిశ్రమ పాలకొల్లులో అతిపద్ద పరిశ్రమ.
- ఆంధ్ర ప్రదేశ్ లో రక్షిత మంచి నీటి పథకము ద్వారా స్వాతంత్ర్యమునకు పూర్వము నుండి మంచి నీరు సరఫరా జరిగిన అతి కొద్ది మునిసిపాలిటీలలో పాలకొల్లు మొదటి మునిసిపాలిటి.
- పాలకొల్లు మిఠాయి తయారీలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పూతరేకులు, సొనె పాప్పొది,బూందీ లడ్డు, జీడిపప్పు పాకం, హల్వాలు విపరీతంగానూ, అత్యదికంగానూ ఎగుమతి అయ్యే మిఠాయిలు.
గ్రేటర్ పాలకొల్లు
పురపాలక సంఘానికి మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నట్లు తీర్మానం కౌన్సిల్ ఆమోదించింది. ప్రస్తుతం 31వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 1.29 లక్షల మంది జనాభాను కలిగి ఉంది. దానికితోడు పులపల్లి, ఉల్లంపర్రు మరియు పాలకొల్లు రూరల్ ఏరియా పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది.
వాతావరణం
| Month | Jan | Feb | Mar | Apr | మే | Jun | Jul | Aug | Sep | Oct | Nov | Dec | Year |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Average high °C (°F) | 27.7 | 30 | 32.8 | 35 | 37 | 36.3 | 32.4 | 32.2 | 32 | 31 | 28.8 | 27.6 | — |
| Average low °C (°F) | 19.2 | 20.9 | 22.8 | 26 | 27.8 | 27.3 | 25.6 | 25.6 | 25.6 | 24.6 | 21.1 | 19.4 | — |
| Precipitation mm (inches) | 1 | 6 | 4 | 7 | 41 | 145 | 266 | 190 | 191 | 286 | 52 | 19 | 1208 |
| Source: India Meteorological Department (climate data)[2] | |||||||||||||
ఈ మండలంలో పనిచేసిన తహసీల్దార్లు
ప్రముఖులు
- స్వాతంత్ర్య పోరాటములో పాల్గొనిన ప్రముఖ వ్యక్తి అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి.
- తెలుగులో గజల్ సంగీత, కవితా ప్రక్రియలకు మంచి ప్రజాదరణ తెచ్చిన గజల్ శ్రీనివాస్ కూడా పాలకొల్లు వాడే.
- మాండొలిన్ వాయిద్యంపై సంగీతాన్ని పలికించడంలో చిన్నతనం లోనే పేరుపొందిన యు.శ్రీనివాస్ జన్మ స్థానం పాలకొల్లు.
సినీరంగములో ప్రముఖులు
- దాసరి నారాయణరావు మరియు ఈయన సతీమణి శ్రీమతి దాసరి పద్మ
- చిరంజీవి
- రవిరాజా పినిశెట్టి
- అల్లు రామలింగయ్య
- అల్లు అరవింద్
- కోడి రామకృష్ణ
- చలం
- వంగా అప్పారావు
- వాకాడ అప్పారావు
- రేలంగి నరసింహారావు
- అడ్డాల చంటి
- కోడి లక్ష్మణ్
సంగీత విద్వాంసులు
- ఉప్పలపు శ్రీనివాస్ (మాండలిన్ శ్రీనివాస్)
వినోద మాధ్యమం
పాలకొల్లు పట్టణంలో ప్రజల వినోదార్థం పది సినిమా థియేటరులు మరియు లలితకళాంజలి నాటక అకాడమీలు ఉన్నాయి. సినీ రంగములో ప్రసిద్దులైన వారు సైతం వారి సొంత పట్టణములో చలన చిత్ర ప్రదర్శన శాలలు నిర్మించడంతో పట్టణం నలు మూలలా సినీ వినోదం సంమృద్ధిగా లభించుచున్నది. ప్రదర్శన శాలల జాభితా-
- శ్రీనివాసా థియేటర్ {బస్టాండు వెనుక}
- అడబల థియేటర్ {బస్టాండు సమీపంలో}
- అడబల మినీ థియేటర్ {బస్టాండ్ సమీపంలో}
- శ్రీనివాసా డిజిటల్ థియేటర్ {ఇది రాష్ట్రంలో మొట్టమొదటి మృదులాంత్ర ప్రదర్శనశాల. బస్టాండ్ వెనుక}
- శ్రీ తేజ థియేటర్ (యడ్ల బజార్)శ్రీ తేజ మిని థియేటర్ (యడ్ల బజార్)this theaters are closed
- శ్రీనివాసా మినీ డీలక్స్. { బస్టాండ్ వెనుక}
- గీతా అన్నపూర్ణ థియేటర్ {రైల్వే స్టేషను రోడ్}
- మారుతీ థియేటర్ {రామ గుండం వీధి}
- రంజనీ సినీ చిత్ర {బస్టాండ్}
(గజలక్ష్మి, వెంకట్రమా, వీర హనుమాన్ థియేటర్లు మూడు ప్రస్తుతం తీసివేయబడినవి) (లక్ష్మీ సాయి ఛిత్రాలయ పేరు శివ పార్వతిగా మార్ఛబడింది. ఈ థియేటర్ కూడా మూతబడినది ) 106.208.122.73 16:36, 2012 జూలై 8 (UTC)
విద్యా సౌకర్యాలు
- కళాశాలలు.
- అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. {బస్టాండ్ వైపు}
- దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల..{యడ్లబజారు వద్ద}
- చాంబర్స్ మరియు కామర్స్ కళాశాల. {పూలపల్లె మార్గములో}
- గౌతమీ జూనియర్ కళశాల. {పూలపల్లె మార్గములో}
- రైస్ మిల్లర్స్ జూనియర్ కళాశాల. {వీరహనుమాన్ చిత్రప్రదర్శనశాల మార్గములో}
- ఆదిత్య జూనియర్ కాలేజ్. {బైపాస్ రోడ్డులో}
- ఉన్నతపాఠశాలలు.
- శ్రీ అల్లు వెంకట సత్యనారాయణ మున్స్సిపల్ ఉన్నత పాఠశాల (1996) బ్రాడీపేట 2వ వీధి
- Narayana e-techno school{near railway station}
- మాచేపల్లి మాణిక్యం-కంచర్ల నరసింహం ఉన్నత పాఠశాల (1900)
- బంగారు రామారావు-మాచేపల్లి వెంకటరత్నం ఉన్నతపాఠశాల {ముఖ్యరహదారి}
- సుభాష్ చంద్రబోస్ మున్స్సిపల్ ఉన్నతపాఠశాల {హౌసింగ్ బొర్దు కాలనీ}
- Sri Venkatewara Upper Primary పాఠశాల, founder Sri Goteti Jagannadha Rao Garu {హౌసింగ్ బొర్దు}
- బి.వి.ఆర్.ఎమ్.బాలికల ఉన్నత పాఠశాల {అన్నపూర్ణ దియేటరు వద్ద }
- బి.వి.ఆర్.ఎమ్.బాలుర ఉన్నత పాఠశాల (అడవిపాలెం,దొడ్డిపట్ల రహదారిన విజయచిత్ర దియేటర్ వద్ద)
- srisaraswathi sisu mandir (near railway station)
- రైస్ మిల్లర్స్ ఉన్నత పాఠశాల. {వీరహనుమాన్ చిత్రప్రదర్శనశాల}
- ఆదిత్య పబ్లిక్ స్కూల్. {బైపాస్ రోడ్డులో}
- SunshineSchool (Bank Street)
- St.Mary's School, Yallavanigaruvu.
- Sri chitanya techno school (Bradipet 2nd street ).
- బోర్డు పాఠశాలలు.
రవాణా సౌకర్యాలు
పాలకొల్లు నుండి ఎటు వైపునకైనా ప్రయాణము చేయుట అతి సులభము.పాలకొల్లు డిపో కానప్పటికీ ఈ పట్టణం రవాణా నర్సాపురం మరియు భీమవరం మరియు తణుకు మరియు రాజోలు డిపోల మధ్య నుండుట వలన నుండి ప్రతి పది నిముషములకు ఒక బస్సు పాలకొల్లు బస్టాండు నుండి బయలు దేరుతుంటుంది. ఇవేకాక పాలకొల్లు నుండి ప్రరిసరప్రాంతముల ప్రతి చిన్న గ్రామాలకు కూడా సర్వీసులు ఉన్నాయి.
రైలు వసతి
- గుడివాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
- విశాఖపట్నం - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57265
- రాజమండ్రి - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57260
- విశాఖపట్నం - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57265
- ఇతర సర్వీసులు.
- ఆటోలు
- టాక్షీలు. {మూడు టాక్షీ స్టాండులు ఉన్నాయి.
- ప్రైవేటు బస్సులు
పాలకొల్లు మాద్యమముగా అత్యధికంగా నడిచే బస్సుల సర్వీసులు
- నర్సాపురం - పాలకొల్లు. ప్రతి ఐదు నిముషాలకొక బస్సు
- మచిలీపట్నం - పాలకొల్లు. ప్రతి గంట నిముషాలకొక బస్సు
- నర్సాపురం - నిడదవోలు. ప్రతి పది నిముషాలకొక బస్సు
- భీమవరం - పాలకొల్లు. ప్రతి పది నిముషాలకొక బస్సు
- తణుకు - పాలకొల్లు. ప్రతి పది నిముషాలకొక బస్సు
- రాజోలు - పాలకొల్లు. ప్రతి పది నిముషాలకొక బస్సు
- రావులపాలెం - నర్సాపురం. ప్రతి పదిహేను నిముషాలకొక బస్సు
- ఏలూరు - నర్సాపురం. ప్రతి పదిహేను నిముషాలకొక బస్సు
- రాజమండ్రి - నర్సాపురం. ప్రతి ఇరవై నిముషాలకొక బస్సు
ఇవికూడా చూడండి
వెలుపలి లింకులు
- బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35. Check date values in:
|date=(help) - climate data Information For Palakollu. "Palakollu". climate data. Retrieved April 17, 2018.
