పార్వతీపురం
పార్వతీపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన పట్టణం.[1] (వినండి: ![]()

పార్వతీపురం రైలు సముదాయం
లోక్‌సభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం పార్వతీపురం లోకసభ నియోజకవర్గంలో చూడండి.
- భారత పార్లమెంట్ లో పార్వతీపురం ఒక లోక్‌సభ స్థానము. దీనిని 2007 సంవత్సరంలో అరకు మరియు విజయనగరం నియోజక వర్గాలలో కలిపారు.
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం పార్వతీపురం శాసనసభా నియోజకవర్గంలో చూడండి.
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో పార్వతీపురం 1951 సంవత్సరం నుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం మరియు బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి
ప్రముఖ వ్యక్తులు
- ఉప్మాక నారాయణమూర్తి (1896 - 1962) ప్రముఖ సాహితీ వేత్త మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
- ఎస్.వి.జోగారావుగా ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
- గణేష్ పాత్రోగా ప్రసిధ్ధి చెందిన ప్రముఖ సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
- వేపా కృష్ణమూర్తి
- గొబ్బూరి వెంకటానంద రాఘవరావు
- పంతుల జోగారావు
- పి.వి.బి.శ్రీరామ మూర్తి -- కథ , నవలా రచయిత
- డా.డి.పారినాయుడు-- జట్టు వ్యవస్థాపకుడు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు -- కవి,రచయిత, బాల సాహితీ వేత్త
| Wikimedia Commons has media related to Parvathipuram. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

