పాదర్తి
పాదర్తి, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523286., ఎస్.టి.డి.కోడ్ = 08592.
| పాదర్తి | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() పాదర్తి |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.468799°N 80.182624°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | కొత్తపట్నం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | |
| - పురుషుల సంఖ్య | 4,226 |
| - స్త్రీల సంఖ్య | 4,213 |
| - గృహాల సంఖ్య | 2,272 |
| పిన్ కోడ్ | 523286 |
| ఎస్.టి.డి కోడ్ | 08592 |
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
కొత్తపట్నం 5.4 కి.మీ,అల్లూరు 7.4 కి.మీ,చేజర్ల 10.5 కి.మీ,ఈతముక్కల 12.2 కి.మీ,ఉలిచి 12.5 కి.మీ.
సమీప పట్టణాలు
కొత్తపట్నం 2.2 కి.మీ,ఒంగోలు 14.3 కి.మీ,టంగుటూరు 18.8 కి.మీ,నాగులుప్పలపాడు 22.5 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
కె.జి.బి.వి.పాఠశాల.
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యలగాల కృష్ణకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. ఆమె పదవీలొ ఉండగానే, 2014,జనవరి-27న అనారోగ్యంతో కాలధర్మం చెందినారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శైవక్షేత్రం.
- శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయం నాల్గవ శతాబ్దినాటిది.
గ్రామ విశేషాలు
ఈ గ్రామంలో 2014,డిసెంబరు-13వ తేదీనాడు, ఇసుక రీచ్ ప్రారంభించినారు. ఇసుక అమ్మకాలలో 25% మహిళా సంఘాలకు, మిగిలిన మొత్తం రైతు సాధికార సంస్థకు అందుతుంది. అక్రమంగా ఇసుక తరలింపుకు అడ్డుకట్ట వేసి, ఇసుక విక్రయాలు పారదర్శకంగా కొనసాగించడానికే, ఇసుక రీచ్ లను మహిళలకు అప్పగించడం జరిగినది. [3]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 8,439 - పురుషుల సంఖ్య 4,226 - స్త్రీల సంఖ్య 4,213 - గృహాల సంఖ్య 2,272
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,444.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,850, మహిళల సంఖ్య 3,594, గ్రామంలో నివాస గృహాలు 1,727 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,349 హెక్టారులు.
మూలాలు
వెలుపలి లంకెలు
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,జనవరి-28; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-14; 11వపేజీ.
