పాండురంగడు (2008 సినిమా)
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి గతంలో 'ఎన్.టి.రామారావు నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారం. కథలో నేటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి అత్యంత అద్భుతంగా ఈ చిత్రరాజాన్ని నిర్మించటం జరిగింది. నందమూరి వారి నటనకు ఎన్నితరాలైనా ప్రేక్షకులు నీరాజనం పడతారని ఈ చిత్రం మరొకసారి నిరూపించింది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా భారవి గారు రచన గావించారు. ఈ రచయత కలం నుంచి జాలువారిన "అన్నమయ్య", "శ్రీరామదాసు" వంటి చిత్రాల వలె ఈ చిత్రం కూడ ఘన విజయం సాధించింది. గోపాలునిగా (పాండురంగడిగా) బాలకృష్ణ. గారి నటన అపూర్వం. తండ్రికి తగ్గ తనయునిగా మరొకసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రములో చూచెవారిని ఆకట్టుకొనునవి శ్రావ్యమైన చక్కని సంగీతము, నటి నటుల అభినయము, చిత్ర నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ, కనుమరుగువుతున్న చక్కని తెలుగు సంభాషణలు, పాటలలో చక్కని సాహిత్యం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చితాన్ని నేటి చిత్రాలకి బిన్నంగా కుటుంబ సమేతంగా చూడవచ్చును.
| పాండురంగడు (2008 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె. రాఘవేంద్రరావు |
|---|---|
| నిర్మాణం | కె. కృష్ణ మోహన్ |
| రచన | జె.కె.భారవి |
| తారాగణం | నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, స్నేహ, టాబు, కె.విశ్వనాథ్, ఎల్.బి.శ్రీరామ్, వేద, సుహాసిని, వై. విజయ |
| సంగీతం | ఎమ్.ఎమ్.కీరవాణి |
| కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
| నిర్మాణ సంస్థ | ఆర్. కె. ఫిల్మ్ అసోసియేట్స్ |
| భాష | తెలుగు |