పసివాడి ప్రాణం

కథ

మాట్లాడలేని, వినపడని ఒక పిల్లాడి (బేబి సుజిత) తల్లిదండ్రులను వేణు (రఘువరన్) అతని స్నేహితుడు కలసి హత్య చేస్తారు. మూగసాక్షి అయిన ఆ పిల్లాడిని కూడా అంతం చేయాలనుకొన్న వారి నుండి ఆ బాలుడు తప్పించుకు పారిపోతాడు. పెళ్ళి జరిగిన రోజునే ప్రేయసి (సుమలత)ని కోల్పోయిన పెయింటర్ మధు (చిరంజీవి) తాగుబోతుగా మారతాడు. రోడ్డుపై నిద్రపోతున్న ఆ బాలుడిని చేరదీసి రాజాగా పిలుచుకొంటుంటాడు. ఆ బాలుడి ద్వారా మధుకి గీత (విజయశాంతి) అనే యువతి పరిచయం అవుతుంది. మధుని ప్రేమిస్తూ ఉంటుంది.

రాజాని వెదుకుతూ మధు ఇంటికి వచ్చి బాబుని చంపాలని చుస్తాడు వేణు స్నేహితుడు. తప్పతాగి మైకంలో పడి ఉన్న మధు చివరి నిముషంలో బాబుని రక్షించుకొంటాడు. బాబుని చంపటానికి వచ్చినతని చిత్రం గీసి బాబు నుండి నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తూంటాడు మధు. జంట హత్యల, బాలుడి అపహరణ కేసుని మధు పై మోపుతాడు ఆ కేసుల్ని విచారిస్తున్న పోలీసు ఇన్స్ పెక్టర్ (కన్నడ ప్రభాకర్). రాజా తన అక్క కొడుకే అని తెలుసుకొంటుంది గీత. ద్రోహులని మధు ఎలా కనిపెట్టాడన్నదే చిత్రం లోని తరువాయి కథ.

విశేషాలు

  • ఈ చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికి దక్కింది.
  • తేనె పూసిన కత్తికి మానవ రూపంగా రఘువరన్ నటన అద్భుతం.
  • మలయాళంలో మమ్ముట్టి నటించిన పూవిన్ను పుదియ పూంతెన్నాల్ ఈ చిత్రానికి మూలం.
  • ఈ చిత్రాన్ని తమిళంలో బ్రహ్మ (1991 సినిమా)గా పునర్నిర్మించారు. సత్యరాజ్, కుష్బూ నటించారు. పిల్లాడిగా మూడు భాషల్లోనూ బేబీ సుజిత నే నటించింది.
  • రోడ్డుపైన బాలుడిని చూసిన, తాగిన మైకంలో ఉన్న చిరంజీవి, బాలుడి అయినవారెవరైనా దగ్గర్లో ఉన్నారా? అని అన్ని భాషలలోనూ అడిగే ప్రయత్నం నవ్వుల పువ్వులని విరబూయిస్తుంది.

పాటలు

  • సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
  • కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ చందమామ
  • చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
  • అందం శరణం గఛ్ఛామి
  • ఇదేదో గోలగా ఉంది

వనరులు : పసివాడి ప్రాణం

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.