పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিমবঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.
| పశ్చిమ బెంగాల్ | |
![]() Map of India with the location of పశ్చిమ బెంగాల్ highlighted. | |
| రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
కోల్‌కతా - |
| పెద్ద నగరము | కోల్‌కతా (Calcutta) |
| జనాభా (2001) - జనసాంద్రత |
80,221,171 (4వ స్థానం) - 904/చ.కి.మీ |
| విస్తీర్ణము - జిల్లాలు |
88,752 చ.కి.మీ (13వ స్థానం) - 19 |
| సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
| అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1960-05-01 - ఎం.కె.నారాయణన్ - మమతా బెనర్జీ - ఒకే సభ (295) |
| అధికార బాష (లు) | బెంగాలీ |
| పొడిపదం (ISO) | IN-WB |
| వెబ్‌సైటు: www.wbgov.com | |
చరిత్ర
క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.
ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.
రాష్ట్రం
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.
విభాగాలు
పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి.
| రాష్ట్రము. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
|---|---|---|---|---|---|---|
| WB | BI | బిర్బం | సురి | 3012546 | 4545 | 663 |
| WB | BN | బంకురా | బంకురా | 3191822 | 6882 | 464 |
| WB | BR | బర్ధామన్ | బరధమన్ | 6919698 | 7024 | 985 |
| WB | DA | డార్జిలింగ్ | డార్జిలింగ్ | 1605900 | 3149 | 510 |
| WB | DD | దక్షిణ దినాజ్‌పూర్ | బలుర్ఘాట్ | 1502647 | 2183 | 688 |
| WB | HG | హుగ్లీ | చిన్సురాహ్ | 5040047 | 3149 | 1601 |
| WB | HR | హౌరా | హౌరా | 4274010 | 1467 | 2913 |
| WB | JA | జల్పైగురి | జల్పైగురి | 3403204 | 6227 | 547 |
| WB | KB | కూచ్ బెహర్ | కూచ్ బెహర్ | 2478280 | 3387 | 732 |
| WB | KO | కోల్‌కత | కోల్‌కత | 4580544 | 185 | 24760 |
| WB | MA | మల్దా | ఇంగ్లీష్ బజార్ | 3290160 | 3733 | 881 |
| WB | ME | మిడ్నాపూర్ | మిడ్నాపూర్ | 9638473 | 14081 | 685 |
| WB | MU | ముర్షిదాబాద్ | బెర్హంపూర్ | 5863717 | 5324 | 1101 |
| WB | NA | నాడియా | కృష్ణానగర్ | 4603756 | 3927 | 1172 |
| WB | PN | ఉత్తర 24 పరగణాలు | బరసత్ | 8930295 | 4095 | 2181 |
| WB | PS | దక్షిణ 24 పరగణాలు | అలిపూర్ | 6909015 | 9955 | 694 |
| WB | PU | పురూలియా | పురూలియా | 2535233 | 6259 | 405 |
| WB | UD | ఉత్తర దినాజ్‌పూర్ | రాయ్‌గంజ్ | 2441824 | 3180 | 768 |
వాతావరణం

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.
సంస్కృతి
భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.
ప్రసిద్ధులైన వారు
సాహితీ వేత్తలు
- రొబీంద్రనాధ టాగూరు: భారత దేశానికీ, బంగ్లాదేశ్ కూ జాతీయగీత రచయిత. కవి, చిత్రకారుడు, సంగీతజ్ఙుడు, తత్వవేత్త. 1913 లో నోబెల్ బహుమతి గ్రహీత.
- కాజీ నజ్రుల్ ఇస్లామ్
- మైకేల్ మధుసూదన దత్తు
- శరత్‌చంద్ర ఛటర్జీ
- బంకించంద్ర ఛటర్జీ
- బిభూతి భూషణ బందోపాధ్యాయ్
జనవిస్తరణ
పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.

