పవర్ (సినిమా)
పవర్ 2014 సెప్టెంబరు 12 న విడుదలైన తెలుగు చిత్రం.
| పవర్ | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | కె. ఎస్. రవీంద్ర |
| నిర్మాత | రాక్‌లైన్ వెంకటేష్ |
| రచన |
కోన వెంకట్ మోహన కృష్ణ కె. చక్రవర్తి |
| నటులు |
రవితేజ హన్సికా మోత్వానీ రెజీనా ముకేష్ రిషి |
| సంగీతం | తమన్ |
| ఛాయాగ్రహణం |
అర్ధ్రర్ ఎ. విల్సన్ జయనన్ విన్సెంట్ |
| కూర్పు | గౌతంరాజు |
| నిర్మాణ సంస్థ |
రాక్‌లైన్ ఎన్‌టర్‌టైన్‌మెంట్ |
విడుదల | సెప్టెంబరు 12, 2014 |
నిడివి | 147 నిమిషాలు |
| దేశం | భారత్ |
| భాష | తెలుగు |
| ఖర్చు |
|
కథ
అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్ (సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’
నటవర్గం
- రవితేజ - ద్విపాత్రాభినయం
- హన్సికా మోట్వాని - నిరుపమ
- రెజీనా - వైష్ణవి
- కన్నెగంటి బ్రహ్మానందం - ఆణిముత్యం
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మాజీ - వెంకట్
- పోసాని కృష్ణ మురళి
- ముకేష్ రిషి
- జీవా
- సంపత్ రాజ్
- హరీశ్ ఉత్తమన్
- పెనుమత్స సుబ్బరాజు
- అజయ్ (నటుడు)
- సప్తగిరి
- సురేఖా వాణి
- ప్రకాశ్ రాజ్
- జోగి బ్రదర్స్
సాంకేతికవర్గం
- మాటలు: కోన వెంకట్
- కథనం: కె.ఎస్. రవీంద్ర, కె. చక్రవర్తి, మోహనకృష్ణ
- సంగీతం: తమన్
- కూర్పు: గౌతంరాజు
- ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
- నిర్మాత: రాక్‌లైన్ వెంకటేష్
- కథ, దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పవర్ పేజీ
- చిత్ర సమీక్ష
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
